ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
 
 
ఇక ఆ పిల్లలు కొద్దికాలానికే భర్తను కోల్పోయి జీవితాంతం దుర్భరమైన వైధవ్యాన్ని అనుభవించవలసి వచ్చేది. వేదన, కట్టుబాట్లు, పేదరికము, వివక్షత వారి నిత్యజీవితంలో భాగంగా ఉండేవి. వారు మాంసం, చేపలు, ఉల్లి, వెల్లుల్లి (ఇంకా పెక్కు కుటుంబాలలో చక్కెర కూడా) తినడం నిషిద్ధం. ఉదయానే అందరికంటే ముందు లేచి చన్నీటి స్నానం చేసి, తడి చీర కట్టుకొని మంచు ఆరని పూలను కోయాలి. ఇంట్లో అందరికంటే వారిది ఆఖరి భోజనం, లేదా పస్తు. మగవారిని ఆకర్షించకుండా ఉండడానికి జీవితాంతం బోడితల, తెల్లచీర, ఇంకెవరికీలేనన్ని ఆంక్షలు, పూజానియమాలు వారికి అంటగట్టబడేవి. ఎందరో వితంతువులు ఇంటినుండి తరిమివేయబడి వారాణసి లేదా బృందావనం చేరి, ప్రార్ధనతోప్రార్థనతో పరిశుద్ధులవ్వాలనే తలపుతో తలదాచుకొనేవారు. కాని వారిలో చాలామంది పడుపువృత్తికి, లేదా మగవారి అత్యాచారాలకు బలయ్యేవారు. ఆధారంలేని తల్లులుగా దుర్భరమైన జీవితాన్ని వెళ్ళబుచ్చేవారు.
 
 
విద్యాసాగర్ 1856లో వితంతుపునర్వివాహ చట్టం (15వ నెంబరు చట్టం) ప్రతిపాదించి దాని అమలుకుిఅమలుకు అన్నివిధాలుగా కృషిచేశాడు. అదే సంవత్సరం డిసెంబరులో సంస్కృత కళాశాలలో విద్యాసాగర్ సహోద్యోగి అయిన శ్రీష్‌చంద్ర విద్యారత్న ఈ చట్టం క్రింద మొదటిసారి ఒక వితంతువును పరిణయమాడాడు. ఈ పెళ్ళిని కుదిర్చిన విద్యాసాగర్ ఈ చట్టం అమలుకు నిర్విరామంగా శ్రమించాడు. సంప్రదాయ పురోహితులు వెలివేసిన అలాంటి పెళ్ళిళ్ళకు స్వయంగా ఆయనే పురోహితునిగా వ్యవహరించేవాడు. తన కొడుకు ఒక వితంతువును పెళ్ళాడడానికి ప్రోత్సహించాడు. పెళ్ళి చేసుకొనలేని వితంతువుల సహాయార్ధం ఒక నిధిని ఏర్పాటు చేశాడు. చాలా వితంతు వివాహాలకు ఆయన స్వయంగా ధనసహాయం చేసి ఆర్ధికమైన ఇబ్బందులలో పడ్డాడు.
 
 
 
[[గౌతంఘోష్]] సినిమా "[[అంతర్జలి యాత్ర]]" 19వ శతాబ్దంలో [[బెంగాలీ]] కులీనబ్రాహ్మణ కుటుంబంలో బహుభార్యాత్వం ఇతివృత్తంగా నిర్మింపబడింది. అ సినిమాలో ఒక పడుచు తన ముసలిభర్త మరణంకోసం [[గంగానది]] తీరాన వేచి ఉంటుంది (అప్పుడు రోగగ్రస్తులను తరచు అలా వదిలివేసే వారు).
 
==సంస్కృత ముద్రణాలయం==