బాపట్ల పశ్చిమ (గ్రామీణ): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 96:
దీనిని '''బాపట్ల పశ్చిమ (గ్రామీణ)''' అని రెవిన్యూ రికార్డుల్లో పేర్కొన్నారు. స్టువార్ట్ పురం పోలీసు స్టేషను పూర్వం ఇక్కడే వుండేది. బాపట్ల ,[[చీరాల]] మధ్య ఇది చాలా కీలకమైన జంక్షన్.
===జన జీవనం===
ఇంచుమించు 50 [[దూదేకుల]] కుటుంబాలు [[కంకటపాలెం]], [[కారుమూరు]], తదితర ప్రాంతాలనుండి ఇక్కడకు వలస వచ్చి పాత గోనె సంచులను బాగు చెయ్యటం, పరదాలుగా కుట్టి అమ్మటం, షామియానాలు వంటపాత్రల సప్లై లాంటి వృత్తుల్లో స్థిర పడ్డారు. ఇక్కడ పాత మసీదు ఒకటుంది. 50 వరకు [[ముస్లిం]] కుటుంబాలున్నాయి. [[ఉర్దూ]] మాట్లాడే ముస్లిముల్ని తురకసాయిబులనీ, తెలుగు మాట్లాడే ముస్లిముల్ని దూదేకుల సాయిబులనీ పిలుస్తుంటారు. తురకం అంటే ఉర్దూ అనే అభిప్రాయమే దీనికి కారణం. దూదేకుల సాయిబులు గుంటూరు మస్తాన్ లాంటి ఫకీర్లకు జెండాలెత్తి '''[[గ్యార్మీ''' పండుగ చేస్తారు. ఊరేగించిన జెండాలను ఉంచడం కోసం అనుకూలమైన సెంటర్లో '''జెండా చెట్టు'''ను ఏర్పాటు చేసుకొంటారు. తురక సాయిబులు కొత్త బట్టలు నగలు కొన్నప్పుడు మసీదు బయట దర్గా మీద వాటిని పెట్టి" [[ఫాతిహా]] "అనే ప్రార్థన చేయించుకుంటారు. నూర్ బాషా రామ్ షా మసీదులో "[[అజాన్]] " ఇస్తుంటే, నూర్ బాషా మౌలాలి (వార్డు మెంబరు) "శాయిబాబా"భక్తి కొనసాగిస్తున్నాడు.
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==