కలవరమాయే మదిలో: కూర్పుల మధ్య తేడాలు

చి సవరణ, replaced: → (9) using AWB
పంక్తి 28:
[http://nemalikannu.blogspot.com/ నెమలికన్ను] అనే బ్లాగులో "మరళి" అనే రచయిత ఈ సినిమాను ఇలా సమీక్షించాడు -
 
శ్రేయ ("కలర్స్ స్వాతి") ఓ గాయని. శాస్త్రీయ సంగీతం రాదు, ఓ హోటల్లో పాటలు పాడుతూ ఉంటుంది. మరో పక్క చార్టెడ్ అకౌంటేన్సి చదువుతూ ఉంటుంది. తండ్రి లేని శ్రేయ కి తల్లే ([[ఢిల్లీ రాజేశ్వరి]]) అన్నీ.. ఆ తల్లికి సంగీతం అంటే కిట్టదు. ఎప్పటికైనా రెహ్మాన్ దగ్గర పాడాలన్నది శ్రేయ కల. (హమ్మయ్య.. హీరోయిన్ కీ ఓ లక్ష్యం ఉంది) లండన్ లో ఉండే శ్రీను (కమల్ కామరాజు, ఆవకాయ్-బిర్యాని ఫేం) ఓ ఆరు నెల్ల ప్రాజెక్టు కోసం హైదరాబాదు వచ్చి హోటల్లో శ్రేయ ని చూస్తాడు. తొలిచూపులోనే శ్రీను తో ప్రేమలో పడిపోతుంది శ్రేయ. పాపం, అతనికి ఇవేవీ తెలియవు, ఫారిన్ రిటర్న్డ్ కదా..
ఇలా చకచకా కథ సాగిపోతుండగా రావు గారు (విక్రం గోఖలే) అనే సంగీత విద్వాంసుడు ఓ రోజు హోటల్లో శ్రేయ సంగీతాన్ని అవమానిస్తాడు, దారుణంగా. శ్రీనూ కూడా శ్రేయ నేర్చుకోవాల్సింది చాలా ఉందనీ, రావుగారైతేనే సరైన గురువు అనీ చెబుతాడు. అసిస్టెంట్ శాస్త్రి (తనికెళ్ళ భరణి) మినహా తనకంటూ ఎవరూ లేని రావుగారు ముక్కోపి. కృత్యదవస్థ మీద ఆయన్నితనకి పాఠాలు చెప్పడానికి ఒప్పిస్తుంది శ్రేయ. శ్రేయ తల్లికి సంగీతం అంటే ఎందుకంత అలెర్జీ? రావుగారి గతం ఏమిటి? శ్రేయ తన లక్ష్యం సాధించిందా? శ్రీనూ కి తన ప్రేమని ప్రకటించిందా? ఇవన్నీ సినిమా రెండో సగం.
 
పంక్తి 34:
 
ఇది సంగీత ప్రధాన చిత్రం. శరత్ వాసుదేవన్ సంగీతం బాగుంది, ఎక్కడా సాహిత్యాన్ని (వనమాలి, సింగిల్ కార్డ్) మింగెయ్యకుండా. చాలా రోజుల తర్వాత చిత్ర గొంతు వినిపించింది. పాటల చిత్రీకరణ పట్ల మరింత శ్రద్ధ చూపితే బాగుండేది. విక్రం గోఖలే కి ఎస్పీ బాలు డబ్బింగ్ చక్కగా కుదిరింది, ఒకరకంగా రావు గారు పాత్రకి తన డబ్బింగ్ తో ప్రాణం పోశారు బాలు. శాస్త్రిగా తనికెళ్ళ నటన పాత్రోచితంగా ఉంది, రెండో సగంలో అక్కడక్కడా కాస్త శృతి మించినప్పటికీ. 'కలర్స్' స్వాతి ది కీలక పాత్ర. మరీ పేపర్లలో రాసినట్టు సావిత్రి ని మరపించలేదు కానీ, మునుపటి చిత్రాలకన్నా బాగా చేసింది.
కమల్ కామరాజు కండల ప్రదర్శన ఓకే. నటన, వాచకం, ఆహార్యం విషయాల్లో చాలా శ్రద్ధ చూపాలి. కీలక సన్నివేశాల్లో అతని నటన, వాచకం తేలిపోయాయి. ఆ ముదురు రంగు లిప్ స్టిక్ వాడకపోతే ఇంకా బాగుంటాడేమో. మొదటి సగం చాలా చక్కగా తీసిన దర్శకుడు రెండో సగం మీద మరికొంచెం శ్రద్ధ పెడితే బాగుండేది. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ చెప్పే పధ్ధతి. రెండో సగం లో సినిమా నిడివి ని కొంచం తగ్గించొచ్చు, ఎడిటింగ్ ద్వారా. అనవసర సన్నివేశాలు లేవు కానీ, కొన్ని సన్నివేశాల నిడివి బాగా పెరిగింది.
 
==బయటి లింకులు==
* [http://kalavaramayemadilo.com/ కలవరమాయే మదిలో అధికారిక వెబ్ సైటు.]
"https://te.wikipedia.org/wiki/కలవరమాయే_మదిలో" నుండి వెలికితీశారు