పసుమర్తి కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 33:
 
==[[గుణసుందరి కథ]] సంగతులు==
అప్పట్లో లంక సత్యం దగ్గర ప్రముఖ దర్శకుడు [[డి.యోగానంద్]] సహాయకుడిగా ఉండేవారు. ఆయన కృష్ణమూర్తిని [[ఓగిరాల రామచంద్రరావు]]కి పరిచయం చెయ్యడం, ఆయన [[కె.వి.రెడ్డి]]గారికి పరిచయం చేయడం జరిగాయి. ఓగిరాల వాహిని వారి [[గుణసుందరి కథ]] (1949)కి సంగీతదర్శకుడు. కె.వి.రెడ్డి గారు పసుమర్తిగారి నాట్య లక్షణాలు, శక్తి సామర్థ్యాలు తెలుసుకుని, 'గుణసుందరి కథ'కి నాట్యదర్శకుడిగా నియమించారు. అదే గొప్ప ప్రవేశం, పరిచయం. గుణసుందరి కథలో రకరకాల నాట్యాలున్నాయి. వాటిని కృష్ణమూర్తి అతినైపుణ్యంతో నిర్వహించారు. వయసు మీరినట్టు కనిపించిన [[శాంతకుమారి]], [[కె.మాలతి]]కి, సున్నితమైన మూవ్‌మెంట్స్ కూర్చి ''కలకలా ఆ కోకిలేమో'' పాటని రక్తి కట్టించారు. ''చిటి తాళం వేస్తానంటే'' అని [[కస్తూరి శివరావు|శివరావు]] చేసిన నాట్యం ఇంకోరకం. ''ఈ వనిలో కోయిలనై'' అని, [[జూనియర్ లక్ష్మీరాజ్యం]] చేసిన అభినయం ఇంకోరకం. ఎరుకల నాట్యంలో కృష్ణమూర్తే స్వయంగా పాల్గొని, నాట్యం చేశారు. ఇక్కడో విశేషం. ఆ పాత్రని గౌరీపతిశాస్త్రి నిర్వహించారు. కాని, నాట్యంలో కృష్ణమూర్తి నటించారు. తేడా తెలియనివ్వకుండా చిత్రీకరించినా, పరిశీలిస్తే తెలుస్తుంది. ఇంకో విశేషం కూడా ఉంది. ఇందులో [[రేలంగి వెంకట్రామయ్య|రేలంగి]], [[గోబేరు సుబ్బారావు]] కలిసి, ''అదియే ఎదురై వచ్చేదాకా'' పాట పాడుతారు. రేలంగికి రేలంగే పాడగా, సుబ్బారావుకి పసుమర్తి పాడారు.
 
==మిగతా సినిమా జీవితం==