జీడి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
==వంటలలో వాడకం(వేపి, ఉప్పు వేసిన జీడిపప్పు)==
 
జీడిపప్పు ప్రఖ్యాత ఫలహారము, దీని ఘనమైన రుచి వల్ల పచ్చిగా కూడా తినవచ్చు, కొద్దిగా ఉప్పు లేదా చెక్కర కలుపుకుని కూడా ఆరగించవచ్చు. జీడిపప్పుని చాకొలేట్ పూతతో అమ్ముతారు కానీ ఇది వేరు సెనగ మరియు బాదం పప్పు కన్నా ఖరీదు ఎక్కువ మరియు వాడకం తక్కువ. థాయి, [[చైనీస్]] వంటకాలలో కూడా జీడిపప్పు భాగం ఉంది, వీరు పూర్తి పిక్కను వాడతారు, అయితే భారతీయ వంటల్లో ముద్ద చేసి షాహీ కుర్మా లాంటి వాటిలో వాడతారు,అంతే కాకుండా పిండి వంటల్లో అలంకరణకు వాడతారు. అంతగా తెలియకపోయినా రుచికరముగా ఉండే జీడిపప్పు యొక్క ఉపయోగం అది లేతగా ఉండి, దాని తోలు ఇంకా గట్టిపదకుండా ఆకుపచ్చ రంగులో ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటుంది. దాని పిక్క మెత్తగా ఉన్నప్పుడు, దానిని కత్తితో రెండు భాగాలుగా చీలుస్తారు. పప్పుని తీసి(అది ఇంకా క్షారతని కోల్పోదు, అందు వల్ల చేతి తొడుగులు అవసరం) పసుపు కలిపిన నీటిలో నానబెడతారు. దీని వల్ల క్షారత కోల్పోతుంది. ఈ విధమైన వాడుక కేరళ వంటకాలలో ముఖ్యంగా అవియల్ తయారీలో కనిపిస్తుంది, ఇందులో రకరకాలైన కూరగాయలు,కొబ్బరి కోరు,పసుపు మరియు పచ్చి మిరపకాయలు వాడతారు. మలేషియాలో లేత ఆకులని పచ్చిగా సలాడ్ లాగా లేదా సంబల్ బెలకన్(మిర్చి మరియు నిమ్మరసం కలిపిన రొయ్యల ముద్ద)కలిపి తింటారు. బ్రెజిల్ లో జీడి పండు రసం దేశం మొత్తం ప్రఖ్యాతి గాంచింది. ఫోర్ట్లేజా వంటి ఈశాన్య ప్రాంత సందర్శకులు తరచుగా అమ్మకందారులు జీడిపప్పు పప్పుని తక్కువ ధరకి అమ్మటాన్ని చూడవచ్చును. కొన్న పిమ్మట ఉప్పువేసి ప్లాస్టిక్ సంచులలో ఇస్తారు. [[ఫిలిపిన్స్]] లో జీడిపప్పు అంటిపోలో యొక్క ప్రఖ్యాతి గాంచిన పంటగా ప్రసిద్ధి మరియు సుమన్ తో కలిపి ఆరగిస్తారు. పంపంగాలో ఒక మిఠాయి అయిన టురోన్స్ డి కసుయ్ కూడా జీడిపప్పు పప్పుతో తాయారు అవుతుంది. జీడిపప్పు మార్జిపాన్ ను తెల్లని కాగితంలో చుడతారు.
 
==మద్యం==
"https://te.wikipedia.org/wiki/జీడి" నుండి వెలికితీశారు