దశరథ్ మాంఝీ: కూర్పుల మధ్య తేడాలు

చి Kvr.lohith, పేజీ దశరథ్‌మంజీ ను దశరథ్‌ మాంఝీ కు తరలించారు: పత్రికలలో సుపరిచితమైన నామం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
దశరథ్‌మంజీ [[బీహార్]] రాష్ట్రాంరాష్ట్రం లోని [[గెహ్లోర్‌]] గ్రామానికి చెందిన ఒక సామాన్యుడు. ఈయన ఇరవైరెండు సంవత్సరాలు కష్టపడి మేరునగ సమానమైన పట్టుదలతో తానే ఒక సైన్యంగా కొండనే తొలిచిన వ్యక్తి.
==జీవిత విశేషాలు==
గెహ్లోర్‌ బీహార్‌ రాజధాని [[పాట్నా|పాట్నాకు]] దాదాపు 100కి.మీ దూరాన ఉన్న ఓ [[పల్లె]]. బయటి ప్రపంచానికీ ఆ గ్రామానికీ మధ్య ఓ కొండ అడ్డం. గెహ్లోర్‌ వాసులు నిత్యావసరాలు కొనుగోలు చేయాలన్నా, అత్యవసర పరిస్థితుల్లో [[వైద్యం]] చేయించుకోవాలన్నా కొండ చుట్టూ తిరిగి వెళ్లాల్సిందే. పోనీ అలాగే వెళ్దామా అంటే 32కి.మీ దూరం. కొండను పూర్తిస్థాయిలో తొలిస్తే అది కేవలం మూడు కిలో మీటర్ల ప్రయాణం.
1967 లో దశరథ్‌మంజీ భార్య ఫాగుణీదేవి ప్రమాదంలో తీవ్రంగా గాయాలయ్యాయి. ఆమెను రక్షించుకుందామన్న మంజీ ప్రయత్నాలకు ఆ కొండే అడ్డమయింది. వైద్యుడి కోసం చుట్టుతిరిగి వెళ్లాల్సిన ముప్ఫైరెండు కిలోమీటర్ల ప్రయాణమే సుదీర్ఘమైంది. ఆమె ఆ గాయాలతోనే మృతి చెందింది. దీంతో కలత చెందిన దశరథ్‌ ఎంతోకాలం ఆలోచించి కొండను తొలిస్తే తప్ప ఊరికి మేలు జరగదని గట్టిగా నిశ్చయించుకుని ఒక ఉలి, సుత్తి తీసుకుని బయలుదేరాడు. ఎవరి సాయం కోసం ఎదురు చూడకుండా ఇరవైరెండు సంవత్సరాలు కష్టపడి మూడు కిలోమీటర్ల మేర 30 అడుగుల వెడల్పున్న రహదారి తొలిచాడు. ఇప్పుడు గెహ్లోర్‌ ను దశరథ్‌ నగర్ గా పేరు మార్చారు.
 
దశరథ్‌మంజీ జీవితం ఆదరంగ మంజి అనె చలనచిత్రనీ ప్రకతిన్చరు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==ఇతర లింకులు==
 
[[వర్గం:విశిష్ట వ్యక్తులు]]
"https://te.wikipedia.org/wiki/దశరథ్_మాంఝీ" నుండి వెలికితీశారు