దశరథ్ మాంఝీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
==కొండను తొలిచిన యోధుడు==
గెహ్లోర్‌ బీహార్‌ రాజధాని [[పాట్నా|పాట్నాకు]] దాదాపు 100కి.మీ దూరాన ఉన్న ఓ [[పల్లె]]. బయటి ప్రపంచానికీ ఆ గ్రామానికీ మధ్య ఓ కొండ అడ్డం. గెహ్లోర్‌ వాసులు నిత్యావసరాలు కొనుగోలు చేయాలన్నా, అత్యవసర పరిస్థితుల్లో [[వైద్యం]] చేయించుకోవాలన్నా కొండ చుట్టూ తిరిగి వెళ్లాల్సిందే. పోనీ అలాగే వెళ్దామా అంటే 32కి.మీ దూరం. కొండను పూర్తిస్థాయిలో తొలిస్తే అది కేవలం మూడు కిలో మీటర్ల ప్రయాణం.
1967 లో దశరథ్‌ మాంఝీ భార్య ఫాగుణీదేవి ప్రమాదంలో తీవ్రంగా గాయాలయ్యాయి. ఆమెను రక్షించుకుందామన్న మాంఝీ ప్రయత్నాలకు ఆ కొండే అడ్డమయింది. వైద్యుడి కోసం చుట్టుతిరిగి వెళ్లాల్సిన ముప్ఫైరెండు కిలోమీటర్ల ప్రయాణమే సుదీర్ఘమైంది. ఆమె ఆ గాయాలతోనే మృతి చెందింది. దీంతో కలత చెందిన దశరథ్‌ ఎంతోకాలం ఆలోచించి కొండను తొలిస్తే తప్ప ఊరికి మేలు జరగదని గట్టిగా నిశ్చయించుకుని ఒక ఉలి, సుత్తి తీసుకుని బయలుదేరాడు. ఎవరి సాయం కోసం ఎదురు చూడకుండా ఇరవైరెండు సంవత్సరాలు కష్టపడి మూడు కిలోమీటర్ల మేర 30 అడుగుల వెడల్పున్న రహదారి తొలిచాడు. ఇప్పుడు గెహ్లోర్‌ ను దశరథ్‌ నగర్ గా పేరు మార్చారు.
 
అది 1960. గ‌హ్లోర్ కు అవ‌త‌లి వైపున్న వంజీర్‌గంజ్ ప‌ట్ట‌ణానికి ఈ ప‌ల్లెకు మ‌ధ్య 300 అడుగులు ఎత్తైన కొండ అడ్డుగా ఉంది. కొండ ఇవ‌త‌లివైపు గ‌హ్లోర్ గ్రామం ఉంటే.. అవ‌త‌లి వైపు మాంఝీ ఓ భూస్వామి వ‌ద్ద‌ క్వారీలో ప‌నిచేసేవాడు. మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో మాంఝీ భార్య ఫ‌ల్గుణీ దేవీ భోజ‌నం తీసుకొచ్చేది.గ‌హ్లోర్ నుంచి కొండ ఇవ‌త‌లికి వ‌చ్చేందుకు స‌రైన రోడ్డు మార్గం లేదు. ఈ వైపుకు రావాలంటే కొండ ఎక్కి దిగాల్సిందే. ఇందుకు కొన్ని గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది. ఒకరోజు మాంఝీ భార్య ఆహారం తీసుకొని వస్తున్నప్పుడు కొండ‌మీది నుంచి ప‌డిపోవ‌డంతో ఆమెకు గాయాల‌య్యాయి. ఆల‌స్యంగా వ‌చ్చిన భార్య‌ను కొట్టాల‌న్న కోపంతో ఉన్న మాంఝీ ఆమె ప‌రిస్థితి చూసి తీవ్ర ఆవేద‌న‌కు లోన‌య్యాడు. 300 అడుగుల ఎత్తైన కొండ‌లోంచి రాతిని తొల‌చి మార్గాన్ని ఏర్పాటు చేసే ప‌నికి శ్రీకారం చుట్టాడు. అందుకోసం త‌న వ‌ద్ద వున్న గొర్రెల‌ను అమ్మి స‌మ్మెట‌, ఉలి, గున‌పాన్ని కొనుగోలు చేశాడు. ఈ ప‌నిముట్ల‌తో కొండ‌పైకి ఎక్కి కొండ‌ను త‌వ్వ‌డం ప్రారంభించాడు. కొండ‌ను త‌వ్వ‌ుతున్న మాంఝీని చూసి గ్రామ‌స్తులు అత‌ణ్ణి పిచ్చివాడిగా చూశారు.<ref name=manjhi>{{cite news|title=తన గ్రామం కోసం ఒంటి చేత్తో కొండను తవ్విన మాంజీ|url=http://telugu.yourstory.com/read/7422bad332/manza-hill-single-handedly-dug-for-his-village|accessdate=24 January 2016|agency=telugu.yourstory|publisher=GOPAL|date=SEPTEMBER 12, 2015}}</ref>
 
కొండ‌ను త‌వ్వేందుకు అంత‌కుముందు చేస్తున్న ప‌నిని మాంఝీ వ‌దిలేశాడు. ప‌నిలేని కార‌ణంగా ఆ కుటుంబం త‌ర‌చుగా ప‌స్తుల‌తో ప‌డుకునేది. అదే స‌మ‌యంలో మాంఝీ భార్య ఫ‌ల్గుణీ అనారోగ్యం పాలైంది. వ‌జీర్‌గంజ్ నుంచి మాంఝీ గ్రామం గ‌హ్లోర్ రావాలంటే అడ్డుగా ఉన్న కొండ కార‌ణ‌గా 75 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించి రావాల్సి వ‌చ్చేది. డాక్ట‌ర్ వ‌ద్ద‌కు తీసుకువెళ్ల‌లేక‌పోవ‌డం కార‌ణంగా ఫ‌ల్గుణీ చ‌నిపోయింది. భార్య చ‌నిపోవ‌డంతో మాంఝీలో ప‌ట్టుద‌ల మ‌రింత పెరిగింది. ప‌దేళ్ల త‌ర్వాత మాంఝీ కొండ‌ను చీల్చాడు. కొండ మ‌ధ్య‌లో చీలిక‌ను ప్ర‌జ‌లు గుర్తించారు. దీంతో కొండ మ‌ధ్య‌లో రోడ్డు వేసేందుకు మ‌రికొంద‌రు కూడా ముందుకొచ్చారు. 1982లో ఆశ్చ‌ర్యం చోటు చేసుకొంది. స‌మ్మెట‌, ఉలి, గున‌పంల‌తో శ్ర‌మించి మాంఝీ కొండ‌ను పిండి చేసి నిజంగానే చిన్న‌పాటి మార్గాన్ని సృష్టించాడు. 22 ఏళ్ల పాటు శ్ర‌మించి ఓ సామాన్య భూమిలేని నిరుపేద కూలి ప‌ర్వ‌తాన్ని జ‌యించాడు. 360 అడుగుల పొడుగు, 30 అడుగుల వెడ‌ల్పుతో కొండ‌ను నిట్ట నిలువుగా చీల్చాడు ద‌శ‌ర‌థ్ మాంజీ. ఇప్పుడు వ‌జీర్ గంజ్‌లో ఉన్న హాస్పిట‌ల్స్‌కు, స్కూల్స్ కు చేరాలంటే కేవ‌లం ఐదు కిలోమీట‌ర్లు ప్ర‌యాణిస్తే స‌రిపోతుంది. ఆ చుట్టుప‌క్క‌ల‌ ఉన్న 60 గ్రామాల ప్ర‌జలు ఆ మార్గాన్ని ఉప‌యోగించుకుంటున్నారు.<ref name=manjhi/>
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/దశరథ్_మాంఝీ" నుండి వెలికితీశారు