దశరథ్ మాంఝీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
 
కొండ‌ను త‌వ్వేందుకు అంత‌కుముందు చేస్తున్న ప‌నిని మాంఝీ వ‌దిలేశాడు. ప‌నిలేని కార‌ణంగా ఆ కుటుంబం త‌ర‌చుగా ప‌స్తుల‌తో ప‌డుకునేది. అదే స‌మ‌యంలో మాంఝీ భార్య ఫ‌ల్గుణీ అనారోగ్యం పాలైంది. వ‌జీర్‌గంజ్ నుంచి మాంఝీ గ్రామం గ‌హ్లోర్ రావాలంటే అడ్డుగా ఉన్న కొండ కార‌ణ‌గా 75 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించి రావాల్సి వ‌చ్చేది. డాక్ట‌ర్ వ‌ద్ద‌కు తీసుకువెళ్ల‌లేక‌పోవ‌డం కార‌ణంగా ఫ‌ల్గుణీ చ‌నిపోయింది. భార్య చ‌నిపోవ‌డంతో మాంఝీలో ప‌ట్టుద‌ల మ‌రింత పెరిగింది. ప‌దేళ్ల త‌ర్వాత మాంఝీ కొండ‌ను చీల్చాడు. కొండ మ‌ధ్య‌లో చీలిక‌ను ప్ర‌జ‌లు గుర్తించారు. దీంతో కొండ మ‌ధ్య‌లో రోడ్డు వేసేందుకు మ‌రికొంద‌రు కూడా ముందుకొచ్చారు. 1982లో ఆశ్చ‌ర్యం చోటు చేసుకొంది. స‌మ్మెట‌, ఉలి, గున‌పంల‌తో శ్ర‌మించి మాంఝీ కొండ‌ను పిండి చేసి నిజంగానే చిన్న‌పాటి మార్గాన్ని సృష్టించాడు. 22 ఏళ్ల పాటు శ్ర‌మించి ఓ సామాన్య భూమిలేని నిరుపేద కూలి ప‌ర్వ‌తాన్ని జ‌యించాడు. 360 అడుగుల పొడుగు, 30 అడుగుల వెడ‌ల్పుతో కొండ‌ను నిట్ట నిలువుగా చీల్చాడు ద‌శ‌ర‌థ్ మాంజీ. ఇప్పుడు వ‌జీర్ గంజ్‌లో ఉన్న హాస్పిట‌ల్స్‌కు, స్కూల్స్ కు చేరాలంటే కేవ‌లం ఐదు కిలోమీట‌ర్లు ప్ర‌యాణిస్తే స‌రిపోతుంది. ఆ చుట్టుప‌క్క‌ల‌ ఉన్న 60 గ్రామాల ప్ర‌జలు ఆ మార్గాన్ని ఉప‌యోగించుకుంటున్నారు.<ref name=manjhi/>
==మౌంటెన్ మ్యాన్==
గ్రామ‌స్తులు ద‌శ‌ర‌థ్‌కి ప‌ర్వ‌త మ‌నిషి (ప‌హాడీ ఆద్మీ.. మౌంటెన్‌మెన్‌) అని పేరు పెట్టారు. మాంఝీ సాధించిన ఘ‌న‌త దిన‌ప‌త్రిక‌ల్లో రావ‌డంతో ప్ర‌భుత్వం కూడా ఈయ‌న శ్ర‌మ‌ను గుర్తించింది. ఇంటిని నిర్మించుకునేందుకు భూమిని కేటాయించింది. ఐతే ఈ భూమిని కూడా హాస్పిట‌ల్ నిర్మించేందుకు మాంఝీ ప్ర‌భుత్వానికే దానంగా ఇచ్చాడు. 2006లో మాంఝీ పేరును ప‌ద్మ శ్రీ అవార్డుకు బీహార్ ప్ర‌భుత్వం సిఫార్సు చేసింది. కానీ అట‌వీశాఖ అడ్డంకులు సృష్టించ‌డంతో ఆ అవార్డును మాంఝీ అందుకోలేక‌పోయాడు. అట‌వీ సంప‌ద అయిన కొండ‌ను తవ్వ‌డం అక్ర‌మ‌మ‌ని అధికారులు కేంద్ర ప్ర‌భుత్వానికి ఫిర్యాదు చేశారు. అయితే వీటిని మాంఝీ ప‌ట్టించుకోలేదు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/దశరథ్_మాంఝీ" నుండి వెలికితీశారు