జైపూర్ కాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
 
==భగవాన్ మహావీర్ వికలాంగ్ సహాయతా సమితి==
1969లో ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడిన [[జైసల్మేర్]] కలెక్టర్ డా|| దేవేందర్ రాజ్ మెహతా వైద్య ఖర్చులు భరించలేని పేద వికలాంగుల సహాయం కోసం '''భగవాన్ మహావీర్ వికలాంగ్ సహాయతా సమితి''' (BMVSS)ని [[జైపూర్ (రాజస్థాన్)|జైపూర్]] లో స్ధాపించాడు. ఈ సంస్థ తరఫున సుమారు ఒక్కొక్కటి 2500 రూపాయలు ఖరీదు చేసే జైపూర్ కాలు ఉచితంగా అమర్చబడుతున్నది. పేద కుటుంబాలు ఏ కులం, మతం, జాతీ తేడా లేకుండా వారికి ఉచితంగా ఈ సేవలను అందిస్తున్నది BMVSS. పేషెంట్‌ని దృష్టిలో పెట్టుకుని చేసే ఈ సంస్థ సేవలు, కొత్తగా కృత్రిమ అవయవాలు పెట్టుకున్న వారికి ఒకేషనల్‌ ట్రైనింగ్ కూడా ఇస్తున్నది. వారికి స్వయం ఉపాధి కల్పించే ప్రయత్నం కూడా చేస్తోంది. మారుమూల గ్రామాల్లో కూడా వెళ్లి సేవలు అందిస్తున్న BMVSS, దేశ వ్యాప్తంగా 22 సెంటర్లతో తమ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం భగవాన్ మహావీర్ వికలాంగ్ సహాయత సమితి, వికలాంగుల కోసం ప్రత్యేకంగా సేవ చేస్తున్న సంస్థలలో ప్రపంచంలోనే అతి పెద్ద సంస్ధ.
 
==ప్రసిద్ధి==
అప్ఘనిస్తాన్ యుద్ధం తరువాత ఈ జైపూర్ కృత్రిమ కాలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినది. ఈ యుద్ధంలో సోవియట్ యూనియన్ (ప్రస్తుత రష్యా) అమర్చిన మందు పాతరల వల్ల కాళ్ళు కోల్పోయిన అనేక మందికి అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థ వీటిని అమర్చినది. ఆ తరువాత కార్గిల్ యుద్ధంలో కాళ్ళు కోల్పోయిన అనేక సైనికులు కూడా వీటినే అమర్చుకున్నారు. ప్రముఖ నటి [[సుధా చంద్రన్]] కూడా జైపూర్ కాలునే అమర్చుకొని [[మయూరి (సినిమా)|మయూరి]] చిత్రంలో నటించి పలువురి ప్రశంసలు అందుకొంది.
"https://te.wikipedia.org/wiki/జైపూర్_కాలు" నుండి వెలికితీశారు