"జైపూర్ కాలు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
'''జైపూర్ కాలు''' అంగవైకల్యం కలవారికి ఒక వరప్రసాదం. ఇది రబ్బరు ఆధారిత పాలీ యూరిథేన్‌తో తయారుచేయబడిన కృత్రిమ అవయవము. మోకాలు క్రింది భాగం నుండి పాదం వరకు వివిధ పరిమాణాలలో ఈ కృత్రిమ అవయవం ఉంటుంది. ఇది ఈ తరహా కృత్రిమ అవయవాలలో అతి చవకైనది మరియు సులువుగా తయారు చేయడానికి, అమర్చుకోవడానికి అనువైనది. జైపూర్ కాలుతో ఓ వ్యక్తి నడవడం, పరిగెత్తడం, సరిగ్గా కూర్చోవడం వంటి తన రోజు వారి అవసరాలు సులువుగా చేసుకోవచ్చు. దీని పనితీరు కారణంగా ప్రపంచంలోనే ఎక్కువ వాడే ప్రాస్ధెటిక్ ఫుట్‌గా పేరుపొందింది.
==చరిత్ర, అభివృద్ధి==
[[జైపూర్ (రాజస్థాన్)|జైపూర్]] లోని ''సవాయ్ మాన్‌సింగ్ ఆసుపత్రి''లో ఎముకల వైద్య నిపుణుడైన [[ప్రమోద్ కరణ్ సేథీ]]1969లో నిరక్ష్యరాస్యుడైన చేతివృత్తి నిపుణుడు రామచంద్ర శర్మతో కలిసి జైపూర్ ఫుట్ ను రూపొందించాడు. జైపూర్ ఫుట్ తయారుచేయక ముందు కృత్రిమ కాలు అమర్చుకోవాలంటే ఖర్చు విపరీతంగా ఉండేది. ఇటువంటి పరిస్థితులలో సేథీ రబ్బరు, చెక్క మరియు అల్యూమినియంతో దీనిని తయారుచేసి తక్కువ ధరలో సామాన్యులకు కూడా అందుబాటులోకి తెచ్చాడు. 1975 వరకు తక్కువమందికి ఈ కృత్రిమ అవయవం అమర్చినా 1975 నుండి 14.5 లక్షల మందికి ఈ కృత్రిమ కాలును ఉపయోగించారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1822227" నుండి వెలికితీశారు