ప్రజా భవిష్య నిధి: కూర్పుల మధ్య తేడాలు

Created page with 'సంఘటిత రంగాలలోని కార్మికులకు ఉద్యోగ భవిష్య నిధి ఉన్నట్టే, అ...'
(తేడా లేదు)

15:22, 29 జనవరి 2016 నాటి కూర్పు

సంఘటిత రంగాలలోని కార్మికులకు ఉద్యోగ భవిష్య నిధి ఉన్నట్టే, అసంఘటిత రంగ కార్మికులకు మరియు సాధారణ ప్రజలకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ సదుపాయం ఉన్నది. కాకపోతే ఇందులో ఉద్యోగ భవిష్య నిధి మాదిరి యజమానుల చెల్లింపు ఉండదు, కేవలం ఖాతాదారుడు మాత్రమే చెల్లించాలి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా జాతీయ బ్యాంకులలో కానీ, దగ్గరలోని పోస్ట్ ఆఫీసులో కానీ తెరవవచ్చు. ఇందులో జమ చేసిన మొత్తంపై కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం వడ్డీ ప్రకటిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటు 8.70 % గా ఉంది. పిపిఎఫ్ లో పొదుపు చేసిన మొత్తానికి గరిష్టంగా ఒక ఆర్ధిక సంవత్సారానికి రూ. 1,50,000/- వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. మొదటగా పిపిఎఫ్ ఖాతా 15 సంవత్సరాలకు తెరవబడుతుంది, ఆ తరువాత ఒకటి లేదా అంతకంటే ఎక్కవ విడతల్లో , విడతకు 5 సంవత్సరాల చొప్పున ఖాతాను పొడిగించుకోవచ్చు. పిపిఎఫ్ ఖాతాలోని మొత్తంపై వచ్చే వడ్డీ మీద ఎటువంటి పన్ను ఉండదు అల్లాగే ఖాతా మెచ్యూర్ అయిన తరువాత వచ్చే మొత్తంపై కూడా సంపద పన్ను (wealth Tax) కలదు. ఒక సంవత్సరంలో ఒక పిపిఎఫ్ ఖాతాలో కనిష్టంగా రూ.500 జమ చేయాల్సివుంటుంది అలాగే గరిష్టంగా రూ. 1,50,000 వరకు జమ చేయవచ్చు. సంవత్సరంలో జమ ఒకేసారి పెద్దమొత్తంలో చేయవచ్చు లేదా 12 వాయిదాలలో చేయవచ్చు. ఖాతా తెరచిన 3 సంవత్సరాల తరువాత రుణ సదుపాయం లభిస్తుంది. పిపిఎఫ్ ఖాతాను ఒక పోస్ట్ ఆఫీసు నుండి మరొక పోస్ట్ ఆఫీసుకు లేదా ఒక బ్యాంకు శాఖ నుండి మరో శాఖకు మార్చుకోవచ్చ్చు. ఒక పిపిఎఫ్ ఖాతా తెరవడానికి కనీస జమ రూ. 100/-. తరువాత ప్రతీ సంవత్సరం రూ. 500 తక్కువ ఖాతాలో జమ చేయాలి. పిపిఎఫ్ ఖాతా పిల్లల పేర(మైనర్స్) కూడా తెరవచ్చు.

ఉద్యోగ భవిష్య నిధి మరియు ప్రజా భవిష్య నిధి మధ్య వ్యత్యాసాలు