వెంకటరామన్ రామకృష్ణన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
| footnotes =
}}
'''వెంకి రామకృష్ణన్''' లేక '''వెంకటరామన్ రామకృష్ణన్''' ప్రఖ్యాత నోబెల్ పురస్కారము పొందిన జీవరసాయన శాస్త్రజ్ఞుడు. [[తమిళనాడు]] లోని [[చిదంబరం]] లో 1952 సంవత్సరములో జన్మించాడు<ref>http://www.mrc-lmb.cam.ac.uk/ribo/homepage/ramak/index.html</ref>.తండ్రి ఉద్యోగరీత్యా గుజరాత్ కు వెళ్ళడంతో బాల్యమంతా, విద్యాభ్యాసమంతా బరోడాలో గడిచింది. మహారాజా శాయాజీరావు విశ్వవిద్యాలయంలో బీయస్సీ ఫిజిక్స్ చదివాడు. తర్వాత [[అమెరికా]] వెళ్ళి [[భౌతికశాస్త్రం]]లో పీహెచ్‌డీ చేసి అక్కడే స్థిరపడ్డాడు; [[రైబోసోము]]ల రూపము ధర్మములపై చేసిన పరిశోధనలకు గాను [[రసాయన శాస్త్రము]]లో 2009 నోబెల్ పురస్కారము లభించింది<ref>నోబెల్ పురస్కారము: http://nobelprize.org/nobel_prizes/chemistry/laureates/2009/</ref>.2010లో భారత ప్రభుత్వం వీరిని [[పద్మ విభూషణ్]] పురస్కారంతో సత్కరించినది.
==తొలి రోజులు==
వారి స్వస్థలం తమిళనాడులోని కడలూరు జిల్లాలోని చిదంబరం. తండ్రి ఉద్యోగరీత్యా మూడు సంవత్సరముల వయసులో [[గుజరాత్]] రాష్ట్రములోని బరోడా ([[వడోదర]]) వెళ్ళాడు.అప్పట్లో బరోడా పాఠశాలలన్నింటిలో గుజరాతీ మాధ్యమమే ఉండేది. ఆ ఊరు మొత్తమ్మీదా ఒకే ఒక ఆంగ్ల మాధ్యమ పాఠశాల ఉండేది. అది క్రైస్తవ సన్యాసుల ఆధ్వర్యంలో నడుస్తుండేది. ఆయన మూడో తరగతిలో ఉండగా దాన్ని బాలికల పాఠశాలగా మార్చివేశారు. అప్పటికే ఆ బళ్ళో చదువుకుంటున్న మగపిల్లలను మాత్రం పై తరగతులకు అనుమతించారు. తండ్రి వెంకటరామన్ బరోడా లోని మహారాజా శాయాజీరావు విశ్వవిద్యాలయములో [[జీవ రసాయన శాస్త్రం]] బోధించే ఆచార్యుడు. పాఠశాల చదువు బరోడా లోనే సాగింది. 1960-61 లో [[ఆస్ట్రేలియా]] లోని [[అడిలైడ్]] లో చదివాడు. 1971 లో మహారాజా శాయాజీరావు విశ్వవిద్యాలయము నుండి భౌతికశాస్త్రములో B.Sc పట్టా పొందాడు. తదుపరి అమెరికా వెళ్ళి ఒహియో విశ్వవిద్యాలయము నుండి 1976 లో భౌతికశాస్త్ర పరిశోధనలకు Ph.D పట్టా పొందాడు. మరలా [[జీవశాస్త్రము]] అభ్యసించడానికి విద్యార్థి గా సాన్ డియగో లోని [[కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం]] లో చేరాడు.<ref>http://www.mrc-lmb.cam.ac.uk/ribo/homepage/ramak/education.html</ref>.