అమృతా షేర్-గిల్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
 
== వృత్తిలో ప్రగతి ==
1934 నాటికల్లా, అమృతా మనస్సులో తను భారతదేశం తిరిగిరావాలని, ఇక్కడి స్థానికతను ప్రతిబింబించేలా తన వృత్తి ఉండాలనే కోరికలు బలీయమైనాయి. తన తుది శ్వాస దాకా అమృత వీటిపైనే పని చేశారు. 1935లో అమృత ఆంగ్ల విలేఖరి మాల్కం మగ్గరిడ్జ్ ను [[షిమ్లా]]లో కలిసినది. తన ప్రేమికుడి చిత్రపటాన్ని అమృతా వేసినది. వారు కొంతకాలం సహజీవనం చేశారు. కార్ల్ ఖండాల్వాలా ఆమె భారతీయ మూలాలను కనుగొనమని ఇచ్చిన స్ఫూర్తితో ఆమె యాత్రలు మొదలుపెట్టినది. చిత్రకళలో [[అజంతా]], [[ముఘల్]], [[పహారీ]] శైలులకు ముగ్ధురాలైనది.
 
1937 లో [[దక్షిణ భారతదేశం]] బయలుదేరినది. Bride's Toilet, Brahmacharis మరియు South Indian Villagers Going to Market ఆమె కుంచె నుండి జాలువారినది అప్పుడే. శాస్త్రీయ భారతదేశపు కళ వైపే ఆమె అధిక శ్రద్ధ చూపేది. అప్పటి వరకు పేదరికం, నిరాశలు మాత్రమే తొణికిసలాడే భారతీయ చిత్రకళను, ఈ చిత్రపటాలతో ఆమె వర్ణాల పట్ల, భారతీయ సూక్ష్మాల పట్ల దాగి ఉన్న భావోద్వేగాలతో నింపివేసినది.
 
 
"https://te.wikipedia.org/wiki/అమృతా_షేర్-గిల్" నుండి వెలికితీశారు