అమృతా షేర్-గిల్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 50:
[[File:Village-scene-1938.jpg|thumb|right|300px|బెంగాలీ శైలిలో చిత్రీకరించబడ్డ ''Village Scene'', 1938.]]
తన మెట్టినింట ఉన్నపుడే అమృతా తీరికగల గ్రామీణ జీవితాలను అంశాలుగా తీసుకొని ''Village Scene'', ''In the Ladies' Enclosure'' మరియు ''Siesta'' వంటి చిత్రపటాలను చిత్రీకరించినది. ప్రముఖ కళావిమర్శకుల మన్ననలు పొందిననూ, అమృతా చిత్రపటాలను కొనుగోలు చేసేవారు మాత్రం ఎవరూ లేనట్లే. తన కళాఖండాలను వెంటబెట్టుకొని భారతదేశం ఆసాంతం ప్రయాణం చేసిననూ అవి అమ్ముడుపోలేదు. చివరి నిముషాన [[హైదరాబాదు]]కు చెందిన సాలార్ జంగ్ వాటిని తిప్పి పంపాడు. మైసూరు మహారాజా రవి వర్మ చిత్రపటాలకే అధిక ప్రాముఖ్యతనిచ్చి వాటిని కొనుగోలు చేశాడు.
 
[[బ్రిటీషు రాజ్]] కు సంబంధించిన కుటుంబం నుండి వచ్చిననూ, అమృతా కాంగ్రెస్ పక్షపాతి. నిరుపేదలు, అణగారినవారు, లేమిలో ఉన్నవారే ఆమెను కరిగించేవారు. అమె కళాఖండాలలో గ్రామీణ ప్రజల, అక్కడి మహిళల దీనావస్థయే ప్రతిబింబించేది. గాంధేయ సిద్ధాంతాలు, జీవినవిధానానికి ఆమె ముగ్ధురాలైనది. 1940లో కలిసినప్పుడు ఆమెలోని వర్ఛస్సు, కళాత్మకతకు [[నెహ్రూ]] సంభ్రమాశ్చర్యానికి లోనయ్యాడు. ఒకానొక దశలో ఆమె కళాఖండాలను గ్రామాల పునర్వవస్థీకరణకు ప్రచారసాధనాలుగా వినియోగించాలని కూడా కాంగ్రెస్ అనుకొన్నది.
 
== బాహ్య లంకెలు ==
"https://te.wikipedia.org/wiki/అమృతా_షేర్-గిల్" నుండి వెలికితీశారు