"బిరుదు" కూర్పుల మధ్య తేడాలు

2,116 bytes added ,  5 సంవత్సరాల క్రితం
చి
 
== బిరుదు ప్రదాతలు ==
బిరుదులను ప్రాచీన కాలంలో తమ ఆస్థానంలో ఉండే కవులకో, తమ ఆస్థానికి వచ్చి మెప్పించిన కవులకో రాజులు ఇచ్చేవారు. విజయనగర రాజులు, తంజావూరు రాజులు ఈ కోవకు చెందినవారే. తరువాత వీరి సంప్రదాయాన్ని సంస్థానాధీశులు, జమీందారులు కొనసాగించారు. [[గద్వాల సంస్థానం|గద్వాల సంస్థాన ప్రభువులు]] సత్కవులను ఎందరినో ఆదరించి, తమ ప్రాంతానికి విద్వద్గద్వాలగా కీర్తిని ఆర్జించిపెట్టారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడ్డాకా ఈ పనిని ప్రభుత్వాలు, అవి ఏర్పాటుచేసిన అకాడమీలు ఇస్తూ వచ్చాయి. మరికొన్ని సాహిత్య సంస్థలు, సాహిత్యాభిలాషులు బిరుదులు ఇవ్వడమనే ఈ పనిని తమ భుజాల మీదికి వేసుకున్నారు. ఆధ్యాత్మిక మఠాలు, పీఠాధిపతులు తమ భావజాలాన్ని ప్రచారం చేసే తమ కవులకు బిరుదులు ఇస్తున్నాయి<ref>ఆంధ్రసాహిత్యంలో బిరుదనామములు, కూర్పు: కోడీహళ్లీ మురళీమోహన్, పుట-3</ref>. ఇక మరి కొందరు కవులు తమకు తామే బిరుదులను తగిలించుకొని ఊరేగుతున్నారు.
 
== బిరుదు గ్రహీతలు ==
== బిరుదు ప్రదాన హేతువులు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1824655" నుండి వెలికితీశారు