సలాం హైదరాబాద్ (నవల): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
హైదరాబాద్ అన్నపూర్ణ. ఎక్కడెక్కడి జాతులవాళ్ళో వచ్చి స్థిరపడి తాము బాగుపడి, నగరాన్ని, రాష్ట్రాన్ని బాగుపరిచారు. ఇక్కడి మూలవాసుల్లో కలిసిపోయి, మూలవాసుల ఉద్యమాలలో పాల్గొన్నారు. తరువాత వచ్చినవాళ్లు మరికొందరు ఇక్కడివాళ్ళ సంస్కారాన్ని, భాషనూ, యాసను పరిహసించి తామే గోప్పవాల్లమన్నట్లు ప్రవర్తించారు. ఈ నవలలో ఇవన్ని వైనంవారిగా చెప్పుకోచ్చినాడు. అప్పటి ఆచారవ్యవహారాలు, ఆటపాటలు, ఇరానీ హోటళ్ళు, ఎక్ మే దో చాయ్, బిర్యానీ, తందూరి రోటీలే కాక అనేక చారిత్రకాంశాలు, మహాలఖాబాయి చందా, పాట్రిక్ ఖైరున్నిసా ప్రేమ వ్యవహారాలు, 1857 సిపాయిల తిరుగుబాటు కూడా ఉన్నాయి. ఇదొక 'హైదరాబాది' ఆత్మ కధ.<ref>[http://www.logili.com/books/salam-hydrabad-lokeswar/p-7488847-90315141209-cat.html Salam Hydrabad By Paravastu Lokeswar (Author)]</ref>
==ముందుమాటలో...==
ఈ నవల గురించి రచయిత తన ముందు మాటగా చెప్పుకున్న వివరాల ప్రకారం, ఈ నవలాకాలం 1578 నుండి జూలై 10, 1970 వరకు. ఇందులోని ముఖ్య వస్తువులు హైద్రాబాద్ చరిత్ర, నగరంలో నడిచిన ఉద్యమాలు, స్వామి అనే ఒక పి. యు. సి. విద్యార్ధి ఆత్మకథ. ఈ మూడు వస్తువుల్నీ కలిపి జడలాగా ఈ నవలను అల్లినట్టు రచయిత చెప్పుకున్నారు.<ref>[http://pustakam.net/?p=1776 సలాం హైదరాబాద్]</ref>
==ఆదరణ==
ఈ పుస్తకం మొదట ప్రచురించింది జూలై 2005 లో. నాలుగు నెలలు తిరక్క ముందే వెయ్యి కాపీలు అమ్ముడుబోయి, నవంబరు 2005 లో రెండవ ముద్రణకు రావడం ఈ నవలకు కలిగిన ఆదరణను ఋజువు చేస్తుంది. మొదటి ముద్రణకు, రెండవ ముద్రణకు మధ్యకాలంలో వచ్చిన పాఠకుల, విమర్శకుల అభిప్రాయాలు రెండవ ముద్రణలో ప్రచురించారు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/సలాం_హైదరాబాద్_(నవల)" నుండి వెలికితీశారు