కోన ప్రభాకరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కోన ప్రభాకరరావు''' [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర మాజీ [[ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్లు|శాసనసభా స్పీకరు]], [[కాంగ్రేస్ పార్టీ]]కి చెందిన రాజకీయ నాయకుడు. మరియు 1940లలో [[తెలుగు సినిమా]] నటుడు, దర్శకుడు మరియు నిర్మాత.
 
ప్రభాకరరావు [[1916]],[[ జూలై 10]]న [[గుంటూరు]] జిల్లా [[బాపట్ల]]లో జన్మించాడు. ప్రాధమికవిద్య బాపట్లలో పూర్తి చేసుకొని [[మద్రాసు]]లోని లయోలా కళాశాలనుండి పట్టభద్రుడయ్యాడు. ఆ తరువాత [[పూణే]]లోని ఐ.ఎల్.ఎస్ న్యాయ కళాశాలనుండి న్యాయ శాస్త్రములో డిగ్రీ పూర్తిచేశాడు.
 
పాఠశాలలో ఉండగా [[మోతీలాల్ నెహ్రూ]] మరణించిన సందర్భముగా తరగతుల బహిష్కరణ నిర్వహించాడు. [[ఉప్పు సత్యాగ్రహము]]లోనూ చురుకుగా పాల్గొన్నాడు. స్వాతంత్ర్యోద్యమ కాలములో ఒక యువబృందాన్ని నిర్వహించి [[ఖాదీ]] వాడకాన్ని వ్యాప్తి చేయటానికి కృషి చేశాడు.
 
ప్రభాకరరావు 1940 అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రములోని బాపట్లలో న్యాయవాద వృత్తిని ప్రారంభించాడు. 1967లో ఆంధ్రప్రదేశ్ [[శాసన సభ]]కు తొలిసారిగా ఎన్నికైనాడు. ఈయన బాపట్ల నియోజకవర్గము నుండే వరుసగా మూడు పర్యాయములు (1967, 1972 మరియు 1978) శాసనసభకు ఎన్నికైనాడు. 1980-81 వరకు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ స్పీకరుగా నియమితుడైనాడు. ఈయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రేస్ కమిటీ అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. [[భవనం వెంకట్రామ్]] మరియు [[కోట్ల విజయభాస్కరరెడ్డి]] మంత్రివర్గాలలో విత్త మరియు ప్రణాళికా శాఖమంత్రిగా కూడా పనిచేశాడు.
 
[[వర్గం:1916 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/కోన_ప్రభాకరరావు" నుండి వెలికితీశారు