సమరసింహారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
సినిమాకు కథ అందించిన విజయేంద్రప్రసాద్ తాను ''సిందూరపువ్వు'' అనే తమిళ సినిమా నుంచి సమరసింహారెడ్డి ప్రధాన ఇతివృత్తాన్ని స్వీకరించానని తెలిపారు. సింధూర పువ్వు కథలో ఒకావిడ తన కూతుర్ని బాగా చూసుకుని, సవతి పిల్లల్ని బాగా చూడదు. అది నచ్చని ఆవిడ సవతి కొడుకు, తన చెల్లెల్ని వదిలేసి పారిపోయి ఓ కథానాయకుడి (విజయకాంత్) దగ్గర డ్రైవర్ గా చేరతాడు. కథానాయకుడు పెద్ద డాన్, అతనిపై ప్రత్యర్థులు దాడి చేసినప్పుడు కాపాడేందుకు డ్రైవర్ చనిపోతాడు. అతని వెనుక ఉన్న కథను తెలుసుకున్న కథానాయకుడు, అతని కుటుంబంలోకి అతని పేరుమీదే వెళ్ళి వాళ్ళని కష్టాల నుంచి బయటపడేస్తాడు.<ref name="సాక్షిలో విజయేంద్రప్రసాద్ ఇంటర్వ్యూ">{{cite web|last1=సాక్షి|first1=బృందం|title=కథానాయకుడు|url=http://www.sakshi.com/news/family/kv-vijayendra-prasad-to-direct-multilingual-project-296333|website=సాక్షి|publisher=జగతి పబ్లికేషన్స్|accessdate=7 February 2016|date=8 డిసెంబర్ 2015}}</ref> ఈ ప్రధానమైన ఇతివృత్తాన్ని స్వీకరించి చనిపోయిన పనివాడు కథానాయకుడి చేతిలోనే పొరబాటున చనిపోవడం, కథను ఫ్లాష్ బాక్ విధానంలో చెప్పడం వంటి మార్పులు చేర్పులు చేశారు.
== థీమ్స్, ప్రభావాలు ==
సమరసింహారెడ్డి సినిమాలో రాయలసీమ ముఠాకక్షలు (ఫ్యాక్షనిజం) నేపథ్యంగా తీసుకున్నారు. ఆపైన రాయలసీమ ముఠాకక్షల నేపథ్యం దశాబ్దానికి పైగా తెలుగు సినిమాలను విపరీతంగా ప్రభావితం చేసింది. ఐతే ఈ సినిమాను మొదట కథారచయిత విజయేంద్రప్రసాద్ బొంబాయి మాఫియా నేపథ్యంలో రాద్దామని భావించారు. కానీ అప్పటికి విజయేంద్రప్రసాద్ కి సహాయకునిగా పనిచేస్తున్న రత్నం సలహా మేరకు రాయలసీమ ఫాక్షన్ ని నేపథ్యంగా చేసుకున్నారు.<br />
సినిమాలో ప్రధానమైన రెండు ఫ్యాక్షన్ గ్రూపుల నడుమ రైల్వేస్టేషన్లో ఎదురుపడడంతో వివాదం జరిగినట్టు రాసుకున్న సన్నివేశం వెనుక నిజజీవిత ప్రేరణ ఉంది.
 
== పాటలు ==
"https://te.wikipedia.org/wiki/సమరసింహారెడ్డి" నుండి వెలికితీశారు