మురళీధర్ దేవదాస్ ఆమ్టే: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
| webpage = http://www.anandwan.in/baba-amte.html
}}
 
'''బాబా ఆమ్టే''' (Baba Amte) (Marathi: बाबा आमटे) ([[డిసెంబర్ 26]], [[1914]] - [[మహారాష్ట్ర]]లోనిఫిబ్రవరి [[వార్థా9]] జిల్లా, [[హింగన్‌ఘాట్‌2008]]లో) జన్మించాడుసంఘసేవకుడు. అతని అసలు పేరు మురళీధర్ దేవదాస్ ఆమ్టే. ప్రముఖ సంఘసేవకుడిగా ప్రసిద్ధిగాంచిన బాబా ఆమ్టే ముఖ్యంగా [[కుష్టు]] రోగుల పాలిట దేవుడిగా మారినాడు. కుష్టురోగుల సేవలకై [[చంద్రాపూర్]] జిల్లాలో [[ఆనంద్‌వన్]] ఆశ్రమాన్ని స్థాపించి అతను కూడా వారితోపాటే అక్కడే జీవితాన్ని గడిపి [[2008]], [[ఫిబ్రవరి 9]]న తన ఆశ్రమంలోనే మృతి చెందిన మహనీయుడు. ఉన్నత కుటుంబంలో జన్మించి భోగభాగ్యాలను వదిలి అణగారిన వర్గాల మేలు కొరకై జీవితాంతం కృషిసల్పిన అతని కృషి మరవలేనిది. అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అతడు చేసిన సేవలకు గుర్తింపుగా లభించాయి.
 
==తొలి జీవితం==
బాబా[[డిసెంబర్ ఆమ్టే26]], మహారాష్ట్రలోని[[1914]] లో [[మహారాష్ట్ర]]లోని [[వార్థా]] జిల్లా హింఘన్‌ఘాట్ [[హింగన్‌ఘాట్‌]]లో ఒక ఉన్నత బ్రాహ్మణ జాగిర్దార్ కుటుంబంలో జన్మించాడు. చిన్నతనంలోనే బాబాగా పిల్వబడ్డాడు. బాబా అనేది ఎవరో ప్రధానం చేసిన బిరుదు కాదు అది తల్లిదండ్రులు పెట్టిన ముద్దుపేరు.<ref name="rediff.com">http://www.rediff.com/freedom/amte3.htm</ref> అతని అసలు పేరు మురళీధర్ దేవదాస్ అమ్టే కాగా అందరిచే బాబా ఆమ్టే గానే పిల్వబడ్డాడు. న్యాయశాస్త్రంలో శిక్షణ పొందిన తరువాత వార్థాలో న్యాయ అభ్యాసం ప్రారంభించాడు. అదే సమయంలో భారత జాతీయోద్యమ పోరాటం జరుగుతుండేది. [[క్విట్ ఇండియా]] ఉద్యమ సమయంలో అరెస్ట్ కాబడిన జాతీయ నేతల తరఫున కోర్టులలో వాదించేవాడు. క్రమక్రమంగా [[మహాత్మా గాంధీ]] వైపు ఆకర్షితుడైనాడు. గాంధీజీతో పాటు కొంత కాలం [[సేవాగ్రం ఆశ్రమం]]లో గడిపినాడు. ఆ తరువాత జీవితాంతం వరకు గాంధీజీ సిద్ధాంతాలకే కట్టుబడినాడు. వేషధారణలో కూడా గాంధీజీ వలె ఖద్దరు దుస్తులనే వాడేవాడు. గాంధీజీ వలె జీవితాంతం అణగారిన వర్గాల కృషికై పాటుపడ్డాడు.
==వివాహం==
[[1946]]లో బాబాఆమ్టే సాధన గులేశాస్త్రిని వివాహం చేసుకున్నాడు. తరువాత కాలంలో ఆమె సమాజ సభ్యులచే సాధనతాయ్ (మరాఠీలో తాయ్ అనగా పెద్దక్క) గా పిలువబడింది. వారికి వికాస్ మరియు ప్రకాష్ అనే ఇద్దరు కుమారులున్నారు. ఆ ఇద్దరు కూడా తండ్రి వలె సమాజసేవకై పాటుపడుతున్నారు.<ref>http://mss.niya.org/people/amte.php</ref>
 
==ఆనంద్‌వన్==
బాబా ఆమ్టే స్థాపించిన మూడు ఆశ్రమాల్లో ఆనంద్‌వన్ మొదటిది. కుష్టురోగుల సంక్షేమానికి [[మహారాష్ట్ర]]లోని [[చంద్రాపుర్]] జిల్లాలో ఈ ఆశ్రమాన్ని [[1951]]లో స్థాపించాడు. ఆనంద్‌వన్ అనగా అర్థం ఆనందపు అడవి (Forest of Joy). వరోరాకు దగ్గరలోని అటవీ ప్రాంతంలో 50 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ప్రారంభించాడు. అది క్రమక్రమంగా పెద్దదై నేడు 500 ఎకరాలకు విస్తరించినది. ఆ రోజులలో కుష్టురోగులకు సమాజం నుంచి వెలివేసేవారు. అలాంటి వారి కొరకు ఆశ్రమాన్ని స్థాపించి కుష్టురోగులను చేరదీసి వారితో పాటు అతడు కూడా అక్కడే వారి సంక్షేమం చూస్తూ గడపటం గొప్పవిషయం. కుష్టువ్యాధి ఒక అంటురోగమని, కుష్టురోగులను తాకినా ఆ వ్యాధి వస్తుందనే ప్రచారంలో ఉన్న సమయంలో బాబాఆమ్టే ఆ వదంతులను త్రిప్పికొట్టడానికి స్వయంగా ఒక కుష్టురోగి నుంచి బాసిల్లి క్రిములను తన శరీరంలో ఇంజెక్షన్ ద్వారా ఎక్కించుకున్నాడు.<ref>http://www.rediff.com/news/2008/feb/09amte2.htm?zcc=rl</ref>
Line 31 ⟶ 34:
[[2008]], [[ఫిబ్రవరి 9]] ఉదయం 4.15 గంటలకు తన ఆశ్రమం ఆనంద్‌వన్‌లో బాబా ఆమ్టే కన్నుమూశాడు. 94 సంవత్సరాల వయస్సు ఉన్న బాబా ఆమ్టే చాలా కాలం నుంచి వెన్నుపూస సమస్యతో భాధపడేవాడు. కొంతకాలంగా రక్తకాన్సర్‌తో బాధపడుతున్నారు. అయిననూ తుదిశ్వాస వదిలే వరకు తాను నమ్మిన సిద్ధాంతాలకే పాటుపడి, తన ఆశయమే లక్ష్యంగా కృషిసల్పినాడు.
[[ఫిబ్రవరి 10]]న అధికార లాంఛనాలతో [[మహారాష్ట్ర]] ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించింది. భౌతికకాయాన్ని దహనం చేయడానికి బదులు ఆయన అంతిమ కోరిక మేరకు ఖననం చేశారు.
 
==అవార్డులు==
అనేక దశాబ్దాల పాటు దీనజన ప్రజల కోసం కృషిసల్పిన బాబా ఆమ్టేకు అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు లభించాయి. అవార్డులతో పాటు లభించిన నగదును సాంఘిక కార్యకలాపాల కోసమే వినియోగించాడు.<ref>http://www.rediff.com/freedom/amte3.htm The Miracle Worker</ref>