"వాడుకరి చర్చ:KingDiggi" కూర్పుల మధ్య తేడాలు

ఇటీవల మీరు తెలుగు వికీపీడియాలోనూ, ఆంగ్ల వికీపీడియాలోనూ సినిమా వ్యాసాల అభివృద్ధికి మంచి ఆసక్తితో కృషిచేస్తున్నారని నేను గమనించాను. ఈ కృషిని ఆస్వాదించి చేస్తున్నట్టూ, తెవికీపీడియా మీకు నచ్చినట్టూ కూడా మీ రచనల ద్వారా నాకు అర్థమౌతోంది. మీకు తెలుగు వికీపీడియాలో సినిమాల వ్యాసాలు అభివృద్ధి చేయడంలో మేము అన్ని రకాలుగానూ సహకరిస్తాము. తెలుగు సినిమాల పరంగా ప్రణాళికాయుతంగా జరుగుతున్న కృషిలో భాగంగా [[వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సినిమాలు/2015 ప్రణాళిక|2015 ప్రణాళిక]] సాగుతోంది. అది కాక [[వేదిక:తెలుగు సినిమా|తెలుగు సినిమా వేదిక]] కూడా ఉంది. వీటిలో చేరవచ్చూ, చేరకుండానూ మీరు కృషి సాగించవచ్చు. మీకు అవసరమయ్యే సినిమా పాటలు-కథ పుస్తకాలు, ఫోటోలు, మాసపత్రికలు వంటివాటి డిజిటల్ కంటెంట్ కూడా ఉన్నంతలో పంచుకుని వాడుకోవచ్చు. ఇక మీరు హైదరాబాదీ అయితే తెలుగు వికీపీడియా మరియు హైదరాబాదీ ఆంగ్ల వికీపీడియన్ల సంయుక్త మీటప్ డిసెంబర్ 20, 2015న అబిడ్స్ లోని [[గోల్డెన్ థ్రెషోల్డ్]] లో నిర్వహిస్తున్నాము, హాజరయ్యే ప్రయత్నం చేయొచ్చు. అక్కడ మీకు అన్ని వికీల్లోనూ ఎదురవుతున్న సమస్యలతో సహా చర్చించుకోవచ్చు. ధన్యవాదాలతో --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె)]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 04:37, 10 డిసెంబరు 2015 (UTC)
: మీ ప్రయత్నాలు బావున్నాయి. వికీలో రచనలు చేస్తున్నందుకు ధన్యవాదాలు. మీకు ఎప్పుడూ వికీ సభ్యుల సహాయ్ం ఉంటుంది.- మిత్రుడు..--[[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|Viswanadh]] ([[వాడుకరి చర్చ:విశ్వనాధ్.బి.కె.|చర్చ]]) 05:34, 6 ఫిబ్రవరి 2016 (UTC)
==మాడా వెంకటేశ్వరరావు చిత్రపటం==
వికీలో మాడా చిత్రపటం [[దస్త్రం:Mada.jpeg|50 px|Mada.jpeg]] ఆల్రేడీ ఉన్నది. మీరు కొత్తగా [[దస్త్రం:మాడా వెంకటేశ్వర రావు.jpg|50 px|మాడా వెంకటేశ్వర రావు.jpg]] ఎక్కించారు. రెండిటిలో ఒకటి చాలని నా అభిప్రాయం.--[[వాడుకరి:బ్రహ్మరాక్షసుడు|బ్రహ్మరాక్షసుడు]] ([[వాడుకరి చర్చ:బ్రహ్మరాక్షసుడు|చర్చ]]) 08:10, 10 ఫిబ్రవరి 2016 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1831055" నుండి వెలికితీశారు