తరిమెల నాగిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 46:
నాగిరెడ్డి తన ప్రభుత్వ వ్యతిరేక రాజకీయకలాపల వళ్ల అనేకమార్లు [[జైలు]]కు వెళ్లాడు. 1940లో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ''యుద్ధం మరియు ఆర్ధిక వ్యవస్థపై దాని ప్రభావం'' అన్న పుస్తకం వ్రాసి ప్రభుత్వము యొక్క ఆగ్రహానికి గురై జైలుకు వెళ్ళాడు. తిరుచిరాపల్లి జైలునుండి విడుదల కాగానే మరలా 1941లో భారతీయ రక్షణ చట్టము కింద అరెస్టయ్యాడు. 1946లో ప్రకాశం ఆర్డినెన్సు కింద అరెస్టయ్యి 1947లో విడుదల చేయబడ్డాడు.
 
1952లో నాగిరెడ్డి మద్రాసు [[శాసనసభ]]కు [[సి.పి.ఐ]] అభ్యర్థిగా అనంతపురం నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. జైలులో ఉండి కూడా, ప్రముఖ కాంగ్రేసు నాయకుడు, తన బావ అయిన నీలం సంజీవరెడ్డిపై విజయం సాధించి సంచలనం సృష్టించాడు. 1955లో కొత్తగా ఏర్పడిన [[పుట్లూరు]] నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేసి తరిమెల రామచంద్రారెడ్డి చేతిలో ఓడిపోయాడు. 1957లో [[అనంతపురం లోక్‌సభ నియోజకవర్గం]] నుండి 2వ [[లోక్‌సభ]]కు ఎన్నికయ్యాడు. తిరిగి 1962లో [[పుట్లూరు]] నియోజకవర్గం నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సి.పి.ఐ అభ్యర్థిగా పోటీచేసి తరిమెల రామచంద్రారెడ్డి ఓడించి ఎన్నికైనాడు. 1967లో నియోజకవర్గాల పునర్విభజనలో పుట్లూరు నియోజకవర్గం రద్దుకాగా, [[కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)|సి.పి.ఐ (ఎం)]] అభ్యర్థిగా అనంతపురం నియోజకవర్గం నుండి మూడో పర్యాయం శాసనసభకు ఎన్నికయ్యాడు. 1969లో మార్చి నెలలో శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేశారు.
 
1968లో నాగిరెడ్డి సి.పి.ఐ (ఎం) నుండి విడిపోయి [[ఆంధ్ర ప్రదేశ్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ కమ్యూనిష్ట్ రెవల్యూషనరీస్]]‌ (ఎ.పి.సి.సి.ఆర్) - ఆంధ్ర ప్రదేశ్ కమ్యూనిష్టు ఉద్యమకారుల సమన్వయ కమిటీ‌ని స్థాపించాడు. సి.పి.ఐ (ఎం) కార్యకర్తలను కొత్తపార్టీలోకి ఆకర్షించడంలో సఫలం అయ్యాడు. కొద్దికాలం ఎ.పి.సి.సి.ఆర్ [[అఖిల భారత కమ్యూనిష్టు ఉద్యమకారుల సమన్వయ కమిటీ]]లో కలసివుంది. రెడ్డి 1976లో తను మరణించేదాకా ఎ.పి.సి.సి.ఆర్ నాయకునిగా కొనసాగాడు.
"https://te.wikipedia.org/wiki/తరిమెల_నాగిరెడ్డి" నుండి వెలికితీశారు