పురుషోత్తముడు (పద్యకావ్యం): కూర్పుల మధ్య తేడాలు

సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన తెలుగు పద్యకావ్యం
Created page with ''''పురుషోత్తముడు''' చిటిప్రోలు కృష్ణమూర్తి వ్రాసిన నవల. ఈ పద్...'
(తేడా లేదు)

01:49, 11 ఫిబ్రవరి 2016 నాటి కూర్పు

పురుషోత్తముడు చిటిప్రోలు కృష్ణమూర్తి వ్రాసిన నవల. ఈ పద్య కావ్యానికి 2008 కేంద్ర సాహిత్య పురస్కారం లభించింది. ఇది పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2009 సంవత్సరం పద్యకవితా పురస్కారం లభించింది.[1]

విశేషాలు

అట్టడుగున దేశభక్తి ప్రధానాంశంగా ఉన్న కావ్యం పురుషోత్తముడు. పురుషోత్తముని పాత్ర చిత్రన దేశభక్తి నేపధ్యంలో భారతీయ సంస్కృతికి ప్రతీకగా తీర్చిదిద్దబడింది. దుష్టుడు, దేశద్రోహి, బానిస స్వభావం కలిగిన "ఆంభి’ పాత్ర చిత్రణ చక్కగా ఉంది. అంభి - అతని చెల్లెలు ప్రార్ధనాదేవి సంభాషణ నాటకీయంగా రక్తికట్టింది. స్త్రీలు అబలలు కారు, సబలలు అని నొక్కి చెపుతూ ప్రార్ధనాదేవి తన అన్న అంభికి లలితాదేవి చండికగా మారడాన్ని గుర్తు చెయ్యడం రమ్యంగా, ఉంది. ప్రతినాయకుడైన అలెగ్జాండర్ శౌర్యాన్నికూడా కవి నిష్పక్షపాతంగా వీరరసాత్మకంగా ప్రశంసించారు. ఈ వీర కావ్యంలోని యుద్ధవర్ణనలు నన్నెచోడ, తిక్కనల యుద్ధ వర్ణనలను జ్ఞప్తికి తెస్తున్నాయి. పురుషోత్తముని సైన్యం అలెగ్జాండర్ సైన్యంతో తలపడడం, పురుషోత్తముని ఏనుగులు చెలరేగి యిరువైపుల దళాలను నాశనం చేయటం, అలెగ్జాండర్ - పురుషోత్తముల ద్వంద్వయుద్ధం మొదలైనవన్నీ కళ్ళకు కట్టినట్లుగా వర్ణించారు.[2]


మూలాలు

ఇతర లింకులు