లాన్స్ నాయక్ హనుమంతప్ప: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
==కెరీర్==
కర్ణాటకకు చెందిన హనుమంతప్ప 2002 అక్టోబర్ 25న మద్రాస్ రెజిమెంట్‌లోని 19వ బెటాలియన్‌లో జవానుగా చేరాడు. 2003 నుంచి 2006 వరకు జమ్మూకశ్మీర్లోని మాహోర్‌లో పనిచేశారు. సరిహద్దుల గుండా ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకోవడంలో సాహసోపేతంగా పనిచేశాడు. ఆ తరువాత 54వ రాష్ట్రీయ రైఫిల్స్(మద్రాస్)లో పనిచేస్తానని ముందుకువచ్చాడు. అక్కడ 2008 నుంచి 2010 వరకు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్స్‌లో అత్యంత చురుగ్గా పాల్గొన్నాడు. 2010 - 2012 మధ్య ఈశాన్య రాష్ట్రాల్లో పనిచేశాడు. అక్కడ బోడోలాండ్, అల్ఫా తీవ్రవాదులుకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్స్‌లో పాల్గొన్నాడు. 2015 అక్టోబర్ నుంచి సియాచిన్ గ్లేసియర్‌లో విధుల్లో ఉన్నాడు. డిసెంబర్ 2015లో ఆయనను ఇంకా ఎత్తై పోస్ట్‌కు పంపించాలని నిర్ణయించారు. దాంతో, 19,500 అడుగుల ఎత్తై క్యాంప్‌కు వెళ్లాడు.<ref>[http://www.sakshi.com/news/national/sonia-letter-to-hanumantappas-mother-312973 విషమంగానే వీర జవాను Sakshi February 11, 2016]</ref>
==అస్తమయం==
ఆయన ప్రాణాలు కాపాడేందుకు ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రి వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. [[ఫిబ్రవరి 11]] [[2016]] గురువారం 12 గంటల ప్రాంతంలో హనుమంతప్ప కన్నుమూశారు.<ref>[http://www.sakshi.com/news/national/lance-naik-hanumanthappa-dies-313117 జవాన్ హనుమంతప్ప కన్నుమూత Sakshi February 11, 2016]</ref>
==మూలాలు==
{{reflist|30em}}