ఉప్పలపాటి వెంకటేశ్వర్లు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్రప్రదేశ్ శాస్త్రవేత్తలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
'''ఉప్పలపాటి వెంకటేశ్వర్లు''' సాంకేతిక శాస్త్ర పరిశోధకుడిగా ప్రవేశించి, అనతికాలంలోనే అపూర్వ విజయాలను సాధించి, గమ్య సాధనలో కార్యదీక్షతో అలుపెరుగని కృషి సల్పిన శాస్త్రవేత్త. ఆయన సాంకేతిక విద్యా జ్ఞానాన్ని జనసామాన్యంలోకి తెచ్చిన వ్యక్తి.
==జీవిత విశేషాలు==
ఆయన [[కృష్ణా జిల్లా]] లోని [[ఘంటశాల]] గ్రామంలో [[డిసెంబరు 16]], 1927 లో జన్మించారు. ఆయన "యు.వి.వర్లు" గా సుపరిచితులు. ఆయన [[హిందూ కాలేజి]] (బందరు) లో డిగ్రీ పూర్తి చేసి, మద్రసు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి డి.ఎం.ఐ.టి ఆనర్స్ (బి.టెక్ తో సమానం) డిగ్రీని డిస్టింక్షన్ లో, ద్వితీయ ర్యాంకుతో అందుకున్నారు.<ref>[http://www.choudarymail.com/history/Notable%20Kammas/Engineering.html కమ్మ ప్రముఖులు]</ref>
 
సాధారణ రైతు కుటుంబంలో జన్మించి పేదరికాన్ని చవిచూసిన ఈయన ప్రముఖ శాస్త్రవేత్తగా రూపొందడానికి ప్రాథమిక విద్యాభ్యాసం నుండే అనేక కష్టాలు భరించాడు. డిగ్రీ అందుకున్న తర్వాత, 1954 లో ట్రాంబే (ముంబై) లోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చి సంస్థలో అసిస్టెంట్ సైంటిస్ట్ గా చేరారు. ఈ సంస్థలోనే తమ పరిశోధనా కృషికి శ్రీకారం చుట్టారు. నూక్లియర్ సాథన సంపత్తి మీద అధ్యయనం చేసారు. మరుసటి సంవత్సరం 1955 లో కేంద్రప్రభుత్వంనిర్వహనలోని అటమిక్ ఎనర్జీ శాఖలో ప్రవేశించారు.
 
==సేవలు==
తారాపూర్ అణు విద్యుత్ కేంద్రంలో చేరి, వివిధ అణుశక్తి పరిశోధనలలో పాలుపంచుకున్నారు. విశిష్ట శిక్షణ నిమిత్తం జపాన్, అమెరికా, బ్రిటన్ దేశాలలో పర్యటించారు. భారత దేశపు మొట్టమొదటి అణురియాక్టరు 'అప్సర" రూపకల్పన, అభివృద్ధి దశలు, ప్రయోగాలు నిమిత్తం నియమితులైన ముగ్గురు సాంకేతిక శాస్త్రవేత్తలలో ఈయన ఒకరుగా కృషి చేశాఅరు. అమెరికా, ఇంగ్లండ్ లలో అణుశక్తి మీద గాడాధ్యయనం చేసిన (1957-58) ఫలితాలు అణుశక్తి మీద ఉన్నత విద్య నేర్పిన అంశాలతో అణు రియాక్టర్ రూపకల్పనకు బాగా ఉపయోగపడ్డాయి. మూడవ రియాక్టరు "జర్లీనా" కు రూపకల్పన చేసి, ప్రయోగించే శాస్త్రవేత్తల బృందానికి సారధ్యం వహించారు. తారాపూర్ అణువిద్యుత్ కేంద్రంలో దాదాపు పుష్కరకాలం పాటు పనిచేశారు. ఈ వ్యవధిలోనే రెండు విభాగాలను కొత్తగా (1963) నెలకొల్పడానికి దోహదపడ్డారు. 1965 తదుపరి కాలంలో ఈయన ఆలోచనలు,ల్ ఊహలు అన్నీ ఉత్పత్తి రంగం మీదకు మళ్ళినాయి. కార్బన్ ఫిల్మ్‌లురెసిస్టర్లు మొదలైన వాటిని స్వదేశీ పరిజ్ఞానంతో తయారచేసే ప్రాధమిక స్థాయి ప్రాజెక్టును రూపొందించారు.