సి.హెచ్. నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ౩ → 3 using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
}}
 
'''చదలవాడ నారాయణ రావు''' ([[సెప్టెంబరు 13]], [[1913]] - [[ఫిబ్రవరి 14]], [[1984]]) 1940 నుంచి 1950 దాకా ఓ దశాబ్ద కాలం పాటు తెలుగు సినీ రంగంలో ఓ వెలుగు వెలిగిన సినిమా నటుడు. [[చిత్తూరు నాగయ్య]], [[వేమూరి గగ్గయ్య]], [[కన్నాంబ]], [[ఋష్యేంద్రమణి]], [[సురభి బాలసరస్వతి]] వంటి కళాకారులు సినిమా రంగంలో ప్రవేశించక ముందు నాటకరంగాన్ని పరిపుష్టం చేసినవారే. అందుకు భిన్నంగా ఎలాంటి నాటకానుభవం , సిఫారసు లేకుండా సినీరంగంలోకి ప్రవేశించి స్వయంకృషితో నటుడుగా పేరు తెచ్చుకొన్న వ్యక్తి '''సి.హెచ్‌.నారాయణరావు'''. వాహినీవారు భక్తి రసాత్మకమైన చిత్రం ‘భక్తపోతన’ (1944) ను విడుదల చేసారు. అందులో రెండు మూడు సార్లు శ్రీరాముడు ప్రత్యక్షమవుతాడు. ఆ శ్రీరాముడ్ని చూసి ప్రేక్షకులు తన్మయులైనారు. అంతకుముందు అంత అందమైన, ఆకర్షణీయమైన శ్రీరామచంద్రుడ్ణి చూడలేదు. ‘సాక్షాత్తు రాముడే’ అన్నారు ప్రజ, పోతన పక్షమై. ఆ శ్రీరామ పాత్రధారి చదలవాడ నారాయణరావు.
==బాల్యం==
సి.హెచ్. నారాయణ రావు గా పిలువబడే ఈయన 1913 సెప్టెంబర్‌ 13న కర్నాటకలో బెంగుళూరు - హుబ్లీ మార్గంలో ఉన్న మధుగిరిలో జన్మించారు. నారాయణరావు తల్లి వైపు తాత, ముత్తాతలు, మేనమామలు అప్పట్లో మైసూరు దివాణంలో పనిచేసేవారు. నారాయణరావు తండ్రి చదలవాడ లక్ష్మీ నరసింహారావు రెవెన్యూ అధికారిగా ఉద్యోగం చేసేవారు. అనంత పద్మనాభ వ్రతం రోజున పుట్టిన బిడ్డ కావడంతో, ఆ దంపతులు పెట్టుకున్న పూర్తి పేరు చదలవాడ అనంత పద్మనాభ దత్తాత్రేయ సత్యనారాయణరావు. ఆ పేరే వెండితెరపై సంక్షిప్తంగా సిహెచ్‌. నారాయణరావు అయింది.
"https://te.wikipedia.org/wiki/సి.హెచ్._నారాయణరావు" నుండి వెలికితీశారు