"వగ్గెల మిత్రసేన" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
'''వగ్గెల మిత్రసేన''' ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే.<ref>[http://www.andhrajyothy.com/Artical?SID=206681 మాజీ ఎమ్మెల్యే మిత్రసేన మృతి 14-02-2016]</ref>
==జీవిత విశేషాలు==
అశ్వారావుపేట మండలం సున్నంభట్టి గ్రామానికి చెందిన మిత్రసేన 1999 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009 నుంచి 2014 వరకు అశ్వారావుపేట ఎమ్మెల్యేగా మిత్రసేన సేవలందించారు<ref>[http://www.elections.in/telangana/assembly-constituencies/aswaraopeta.html Sitting and previous MLAs from Aswaraopeta (ST) Assembly Constituency - See more at: http://www.elections.in/telangana/assembly-constituencies/aswaraopeta.html#sthash.EVEvi2ct.dpuf]</ref>. 2009లో కొత్తగా ఏర్పడిన అశ్వారావుపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మిత్రసేన విజయం సాధించారు.<ref>[http://10tv.in/content/%E0%B0%AE%E0%B0%BE%E0%B0%9C%E0%B1%80-%E0%B0%8E%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B1%86%E0%B0%B2%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87-%E0%B0%B5%E0%B0%97%E0%B1%8D%E0%B0%97%E0%B1%86%E0%B0%B2-%E0%B0%AE%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B1%87%E0%B0%A8-%E0%B0%95%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B1%81%E0%B0%AE%E0%B1%82%E0%B0%A4 మాజీ ఎమ్మెల్యే వగ్గెల మిత్రసేన కన్నుమూత..] </ref> <ref>[http://www.newindianexpress.com/states/telangana/Former-MLA-Mitrasena-Passes-Away/2016/02/14/article3276308.ece Former MLA Mitrasena Passes Away]</ref>
 
గిరిజనులకు పోడు భూములపై హక్కును కల్పిస్తూ మహానేత వైఎస్సార్ హయాంలో రూపొందించిన అటవీహక్కు చట్టం, అటవీహక్కు పత్రాల పంపిణీని. సగానికిపైగా ఎస్టీ రిజర్వుడ్ స్థానాలున్న ఖమ్మం జిల్లా నుంచి ప్రారంభించడంతో వగ్గెల మిత్రసేనది కీలకపాత్ర. ప్రజల మనిషిగా పేరున్న ఆయన స్వగ్రామం సున్నంబట్టికి సర్పంచ్ గా ఎన్నికవావడం ద్వారా తన రాజకీయప్రస్థానాన్ని ప్రారంభించారు. కొంతకాలం అశ్వాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ గానూ పనిచేశారు.<ref>[http://www.sakshi.com/news/district/former-mla-mitrasena-passes-away-313722 మాజీ ఎమ్మెల్యే మిత్రసేన మృతి Sakshi | Updated: February 13, 2016]</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1833142" నుండి వెలికితీశారు