శ్రీ కృష్ణదేవ రాయల రాజ సేవకులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
===విద్వత్సభారాయరంజక శ్రీరంగరాజు===
 
రాయలవారి పూర్వుల కాలంనుంచి విజయనగరరాజభవనంలో ఒక నాటకశాల ఉండేది. రాయలవారి కాలంలో ఒక నాట్యశాల, నృత్యశాల ఉండేవి. రాయల వారు తన ఆస్థానంలో సంగీతవిద్వాంసులను పోషిస్తూ సదా విద్యాగోష్టిలో కాలక్షేపంచేస్తూ విద్వత్ సభారయలనే బిరుదువహించారు. నృత్యము చేసి సంగీతము పాడి ఆయనను రంజించే ఆటపాటలకు మేళమొకటి ఉండేది. ఈమేళానికి నాయకుడు తిరుమలనాధుని కుమారుడైన శ్రీరంగరాజు. అతనికి విద్వత్ సభారాయరంజక అనే బిరుదు ఉండేది. రాయల వారాయనకు గొప్ప జాగీరు లిచ్చారు. అందులో [[ఎర్లంపూడి]] అనే గ్రామాన్ని ఈ శ్రీరంగరాజు క్రీ. శ. 1514లో వెంకటేశ్వరుల స్వామివారికి సమర్పించాడు. ఈ శ్రీరంగరాజు కుమార్తె అయిన రంజకం కుపాయి అనే కుప్పసాని క్రీ.శ. 1512లో చేసిన దానం ఒకటి కనబడుతున్నది.
 
ఈకుప్పాయికి [[తిరుమలమ్మ]], [[ముద్దుకుప్పాయి]] అనే ఇద్దరు కుమార్తెలుండేవారు. తిరుమలమ్మ స్వామివారికి 3000 నార్పణములు సమర్పించినట్లు శాసనములున్నవి. ముద్దు కుప్పాయి అచ్యుతదేవరాయలవారికి అంతఃపురపరిచారికగా ఉంటూఉండి ఆయన ఆజ్ణప్రకారము తిరుపతి స్వామివారికి సేవచేయడానికి వచ్చినట్లు, గోవిందరాజస్వామివారి[[గోవిందరాజస్వామి]]వారి ఆలయంనుంచి రోజూ ఆవిడకు తినడానికి ప్రసాదం ఇస్తూఉన్నట్లు క్రీ.శ.1531 సం.లో లభించిన శాసనంలో వ్రాయబడియున్నది. ఈ శాసనంలో శ్రీరంగరాజు కుమార్తెయున్నూ, ముద్దుకుప్పాయి తల్లినీ అయిన కుప్పసానికి కూడా "విద్వత్సభారాయరంజకం" అనే బిరుదు ఉండినట్లు చెప్పబడియున్నది.
 
ఇలాగ విజయనగర చక్రవర్తుల సేవను చేసే స్త్రీ పురుషులలో గొప్ప వంశాలవారూ, శ్రీమంతులూ అనేకులుండేవారని తిరుపతి దేవస్థానములో నున్న శాసనాలవల్ల తెలుస్తున్నది.