శ్రీ కృష్ణదేవ రాయల రాజ సేవకులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
 
===అమరం తిమ్మరసయ్య===
తిరుపతి దేవస్థానంలో ఉన్న శాసనాలవల్ల కృష్ణదేవరాయలవారి కొలువులో అవసరం తిమ్మయనే దండనాయకుడొకడు రాయలవారి వాకిటికావలి ద్వారపాలకుల పై అధికారియై ఉన్నట్టున్నూ, అతడు వేయిమంది సైనికులకధికారి అని, చిన్న సంస్థానమునేలే సామంతమండలేశ్వరుడిన్నినీ, అతనిని అమరం తిమ్మరసయ్య, తిమ్మప్పనాయకుడు అనిపిలిచేవారని, ఆయనకు రాయలవారిదగ్గర చాలా చనువు ఉన్నట్లు, చాలా మందికి ఆయన రాయలవారి దర్శనం చేయించి అనేక సందర్భాలలో చాలా ఉపకారాలు చేసినట్లు తెలుస్తున్నది. తిరుపతిలో[[తిరుపతి]]లో ఉన్న దానశాసనాలలో అవసరం నరసయ్య, తిమ్మయ్య, నరసయ్య, అనే ముగ్గురు అన్నదమ్ములపేర్లు, వారితల్లి బసవమ్మగారి పేరున్నూ కనబడుతూఉంది. శా.శ. [[1434]] కు సరియైన ఆంగీరసనామ సం. క్రీ. శ. 7-8-1512 నాటి శాసనంలో ఈ కుటుంబంవారికి తిరువెంగళనాధుడు ఇలువేల్పు అన్నట్లు, అవసరం నరసయ్య తిమ్మయ్యగార్లు "రాయర బాగిల అవసరద" - అనగా రాయలవారి తలుపుల దగ్గర ఉండే ద్వారపాలకులైనట్లున్నూ వివరింపబడినది. ఈయననే వాకిటికావలి తిమ్మన్న అని చెప్పుదురు.
 
సేలంజిల్లా [[అరగలూరు]] గ్రామదేవాలయం రొక్క దేవాదాయాన్ని వసూలు చేసి గుడిపనులు జరిగించే స్థానికులనే గుడిపారుపత్తెగార్లు ముగ్గురికి కొన్ని ఇబ్బందులు కలిగి వాటి గురుంచి శ్రీ కృష్ణదేవ రాయల వారికి స్వయంగా చెప్పుకుందామని వారు రాజధాని అయిన విద్యానగరానికి వెళ్ళారు. అక్కడ రాయల వారి ద్వారము వద్దనుండే ప్రధానుద్యోగి అయిన అమరం తిమ్మరసయ్యగారు వీరిని రాయలవారిదగ్గరికి తీసికొనివెళ్ళి దర్శనం చేయించి వారి యిబ్బందులను తొల్గింపజేయడమే కాక వారికొక హారము, తలపాగ, గుర్రము, గొడుగున్నూ బహుమతి చేయించాడట. ఈసంగతి శా.శ. వర్షములు 1441 సరియైన ప్రమాది సంవత్సర (క్రీ.శ. 10-6-1519) నాటి శాసనంలో ఉదహరింపబడినది.
 
ఈ అమరం తిమ్మర్సయ్య గారే వాకిటి కావలి తిమ్మన్న అందురు. 'అమరం మనగా పాళెపట్టుదొరల కియ్యబడు కొలది సీమ అని [[శబ్దరత్నాకరము]]లు అర్ధం చెప్పియున్నారు. బత్తెము, సైనిక బలము, జమీనుగల ఒక గొప్ప హోదా కలవారికి ఈఎ బిరుదు కలదు. విజయనగర సాంరాజ్యములోని వివిధ ప్రాంతాలలో గల కోటలకు అధ్యక్షులై దేశాన్ని పరిపాలించే ప్రభువులను అమరనాయకులనే వారు. వీరురాజోద్యోగులై, దండనాయకులై, దేశపరిపాలకులైన నాయకులు. రాజకీయోద్యోగులలో దొరలు, పారుపత్యదార్లు, రాయసంవారు, అవసరంవారు, రాచకరణాలు, అనే వివిధ హోదాలవారు కనబడుతున్నారు.
 
[[గోర్లంట]] గ్రామంలోని దేవాలయ సేవకులకు గల కొన్ని బాధలను సూరపరాజు అనే ఆయన తీర్చాడని, ఆయన వాకిటి ఆదెప్పనాయనింవారి తండ్రిపేరు తిమ్మప్పనాయకుడిన్ని [[1912]] వనాటి మద్రాసు ఎపిగ్రాఫికల్ రిపోర్టు 55వ పేరాలో ఉదహరింపబడినది.
 
అవసరం తిమ్మయని, అమరం తిమ్మయని, వాకిటి తిమ్మయ్యని అని వేరు పేర్లు గల తిమ్మప్ప నాయకుడు రాయల ముఖ్య రాజ సేవకుడుగా చెప్పుచుందురు.