దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
పూర్వం పెద్దాపురం సంస్థానం ఆంధ్ర దేశం లో ఒక బాగం గా వుండేది. దానిని సుమారు 300 సంవత్సరముల వరకూ శ్రీ వత్సవాయ వంశస్తులైన క్షత్రియులు పాలించారు. ఆ తరువాత సంస్థానంలోకి చిన్న చిన్న జమిందారులు, ముఠా లు మాత్రమే ఒకప్పుడు పెద్దాపురం అన్నంతగా మారిపోయింది. ఆ తరువాత పెద్దాపురం ఒక తాలుకా గ్రామంగా ఉండి బ్రిటీషు వారి అనేక కార్యాలయములతో నిండి పోయింది....పూర్వం ఈ పెద్దాపురం - పిఠాపురం ప్రాంతాలు " పొర్లు నాడు " అని పిలవ బడేవి - పెద్దాపురానికి ఉత్తర దిక్కున ఏలేరు నది ప్రవహించడం వాళ్ళ దీనికి ఆ పేరు వచ్చిందని అనేవారు. 'ఈ ఏలేరు ఆధారము వలననే పల్లపు భూములలోని చాలా బాగం సాగు చేయబడుచున్నది. ఇక్కడ మెట్ట పంట విరివిగా పండును. గోదావరి జిల్లాలన్నిటిలో ఇతర తాలుకా గ్రామాలన్నిటినీ పోల్చి చూస్తే ఇక్కడ జన సంఖ్య తక్కువగా ఉన్నది. ఇక్కడ చదరపు మైలుకి (కిలోమీటరున్నర) కి సుమారు 331 మంది మాత్రమే కలరు. పల్లపు తాలూకాల కంటే విద్యా విషయం లో వెనుకబడి వుంది. పురుషులలో నూటికి 5 శాతం ప్రజలు మాత్రమే చదవడం, వ్రాయడం నేర్చుకొన్నారు. ఉ త్తర సర్కార్లు అని పిలువబడే ఆంధ్రదేశ బాగంలోని ఈ పెద్దాపురం సంస్థానమును పరిపాలించిన శ్రీ వత్సవాయ రాజ వంశీయులు సూర్యాన్వయ సంభవులనీ వీరికి మూల పురుషుడు సాగిపోతరాజు అని ఏనుగు లక్ష్మణ కవి వారు తన రామ విలాసం అనే గ్రంధములో
* మీ [[వంగలపూడి శివకృష్ణ]]
------------------------------------ అయిపొయింది - Completed ---------------------------------
 
 
{{పెద్దాపురం సంస్థానాదీసుల నిర్మాణం}} : [[ఆత్రేయపురం]] అగ్రహారం
ఆత్రేయపురం గ్రామం : ఈ పేరు వింటే ప్రపంచ వ్యాప్తంగా వున్నా తెలుగు వారికి గుర్తొచ్చేది ఏంటి ?
పూత రేకులు... పూత రేకులు... పూతరేకులు....
మరి ఆత్రేయ పురం గ్రామం ఎలా ఏర్పడిందో మనలో ఎంతమదికి తెలుసు ... అక్కడి అగ్రహార నిర్మాణం దాని పూర్వ చరిత్ర వైభవం.
 
గోదావరి - కొండలు, కోనల మీదుగా ప్రవహిస్తూ, గరువాల నడలతో పరవళ్లు తొక్కుతూ, శంఖాలు పూరించి కిన్నరులు మీటుతూ, ఎందరెందరో వీరవరుల విజయగాధలకూ, కవి వర్యుల మధుర భావనలకూ, గాయకుల గంధర్వ గానాలకూ శిల్పిశ్రేష్టుల అపూర్వ సృష్టికి, శాస్త్రజ్ఞుల విజ్ఞాన వైభవానికి ఆలవాలంగా అలరారుతోంది.
ఆంధ్రదేశంలో ఈ గోదావరి తెలంగాణాలో ప్రారంభించిన తన యాత్ర తూర్పు సాగరాభిముఖంగా సాగిస్తూ, సప్త శాఖలుగా సాగర సంగమం చేస్తూంది. గోదావరి పొడుగునా వేదవిదులు, ఆర్ష నాగరికతా ధౌరేయులు అయిన ఎందరో విప్రవంశాల వారు నివసిస్తూ, వేద విద్యకు అధీతి, బోధ, ఆచరణ ప్రచారణలతో చతుర్ముఖుని నాలుగు ముఖాల్లా విలసిల్లజేస్తున్నారు. విదేశీ దండయాత్రలూ, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడల్లా వీరు తమ ప్రశాంత నివాసాలను వీడి వలస పోవలసి వస్తున్నా, వారు గోదావరి మాత ఒడిని మాత్రం వీడలేదు. ఆ నదీమతల్లి ననుసరించి పయనిస్తూ, గోదావరీ సాగర సంగమ ప్రాంతాన్ని చేరుకొన్నారు. కొన్ని విప్రవంశాల వారు పావన గౌతమీ తీరాన నివసిస్తూ, వేదమాతనుపాసిస్తూన్న విప్రులలో జటావల్లభుల వారు, కాశీచయనుల వారు కొందరు సంప్రదాయ బద్ధంగా సంవత్సరాల పాటు నియమనిష్ఠలతో అభ్యసించిన వేద విద్యను శిష్యులకు ఆదరంగా నేర్పారు వారు.
 
ఆ వేద ప్రతిపాదితాలైన యజ్ఞ యాగాది కర్మలను తాము ఆచరిస్తూ, తోటి వారిని ఆచరింప చేయడానికి వారు కృషి చేసారు. ఋత్విక్కు అధ్వర్యుడు, ఉద్గాత, ఉపద్రష్ట, అను నలుగురు యజ్ఞ విధులను నిర్వర్తించేవారు. యజ్ఞం చేసి సోమయాజి కావడం నాటి విప్రుల జీవిత పరమావధి.
వీరిలో జటావల్లభుల వారు మొదట్లో తెలంగాణాలోని వెదురుచర్ల అనే గ్రామంలో నివసిస్తూ ఆ గ్రామ నామమే ఇంటిపేరుగా ధరిస్తూ వుండేవారు. వేదమాతకు వారు కూరిమి బిడ్డలు, జటా, ఘన అనేవి వేదంలో క్లిష్టమైన అంశాలు వాటిని నిర్దుష్టంగా పఠించి పండిత పరిషత్తులో జటావల్లభ అనే బిరుదు నామాన్ని పొందారు ఆ వంశంలోని ఓ ధన్యజీవి. నాడు దేశాన్ని పాలిస్తున్నది తురుష్కులైనా, వారిలో కొందరు వేదవిద్య పట్ల గౌరవాభిమానాలు కలిగి వుండేవారు. అటువంటి నవాబు ఒకరు వీరికి ఈనాములు ఇచ్చి గౌరవించారు.
కాలక్రమాన వచ్చిన యుద్ధాల వలన ప్రజా జీవితం కలత చెంది అనుష్టానాలకు భంగం వాటిల్లుతూ వుండటం వలన వారు ఆ ఊరు విడిచి పెట్టవలసి వచ్చింది. ఉన్న ఊరు కన్నతల్లి అన్నారు కదా ! ఉన్న ఊరు విడిచినా గోదావరి తీరవాసాన్ని మాత్రం వీడలేని వారు ఆ నది వెంబడే సుదీర్ఘ పయనాలు సాగిస్తూ వచ్చి పెద్దాపురం సంస్థానం చేరారు.
ఆ రోజుల్లో పెద్దాపురం సంస్థానం మంచి ఆదాయం కలిగివుండి ధర్మపరుడు, శాంతి భద్రతలు పరిరక్షించగల సమర్థుడు అయిన ప్రభువు పాలన ఉండేది. ఈ వేద పండితుల్ని సగౌరవంగా ఆదరించి, కొన్ని ఈనాములు ఇచ్చి తమ కొలువులో నెలకొల్పుకొన్నారు ఆ ప్రభువులు. ఒక పర్యాయం పెద్దాపురం ప్రభువులకు స్వప్నంలో సాక్షాత్కరించి తాను గౌతమీ తీరాన వెలుస్తున్నానని తనకు గుడి గోపురాలు నిర్మించి, పూజా పురస్కారాలకు ఏర్పాట్లు చేయమని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆదేశించాడు. గోదావరి డెల్టాలో వాడపల్లి అనే గ్రామం వద్ద గోదావరిలో బెస్తవారికి వేంకటేశ్వర స్వామి విగ్రహం లభించింది. దాన్ని వారు ఒక పాకలో వుంచి వారికి తోచిన విధంగా పూజాదికాలు నిర్వహిస్తున్నారు. రాజ పురుషులు అక్కడికి వచ్చి స్వయంగా చూసి ఆ విషయాన్ని ప్రభువులకు నివేదించారు. మహారాజు అశ్వారూఢుడై బయలుదేరి వచ్చాడు. ఆలయ నిర్మాణానికి తగు ఏర్పాట్లు చేసారు. ఆలయంతో పాటు స్వామి సేవకు అర్చకులూ, మహా ప్రసాదం తయారు చేయడానికి వంటవారు, స్వామి సేవకులు, వాద్యకారులైన మంగలులు, నృత్య గీతాదికైంకర్యానికి దేవదాసీలు వచ్చి చేరారు. ఆలయ ధర్మకర్తలుగా తమ సంస్థానంలో వున్న వేద పండితులైన జటావల్లభుల వారి వంశంలో ఒక శాఖను వాడపల్లి పంపారు పెద్దాపురం సంస్థానాధీశులు. వీరితో పాటు మరికొన్ని బ్రహ్మణ వంశాల వారు గౌతమీ తీర వాసాన్ని కోరి వచ్చారు. వారందరికీ ప్రభువు వాడపల్లి గ్రామానికి 2 మైళ్ళ దూరంలో నివేశన స్థలాలు, జీవికకై పంట పొలాలు ఇచ్చి ఆత్రేయపురం అగ్రహారాన్ని ఏర్పరచారు. అష్టాదశ వర్ణాల వారు వచ్చి అగ్రహారానికి అనతి దూరంలో నివాసాలు ఏర్పరుచుకున్నారు. ఆత్రేయపురం గ్రామం ఆ విధంగా ఏర్పడింది.
* మీ [[వంగలపూడి శివకృష్ణ]]
------------------------------------ అయిపొయింది - Completed --------------------------------
 
 
తొలి[[తిరుపతి]] - - మన [[పెద్దాపురం]] - [[చదలాడ]] తిరుపతి
శృంగార వల్లభుని - స్వర్ణ రథ కాంతి
తిరుపతి అనగానే మనకు గుర్తుకువచ్చేది చిత్తూరు జిల్లాలోని తిరుమల తిరుపతి
అయితే తూర్పు గోదావరి జిల్లాలోని మన పెద్దాపురం లోనే తిరుపతి వుందని
అదే తొలితిరుపతి అని --- అది సింహాచలం 8000 సంవత్సరాలు , తిరుమల తిరుపతి 6000 సంవత్సరాలు .. మరియు దేశంలోని ఇతర ప్రసిద్ది చెందిన నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాల కంటే మిక్కిలి పురాతనమై , పరమ పవిత్రమై న చిరుమందహాస చిద్విలాస శ్రీ శృంగార వల్లభ స్వామి శోభాయమానంగా స్వయంభువుగా కొలువుదీరిన దేవాలయానికి 9000 (తొమ్మిది వేల సంవత్సరాల చరిత్ర వుందని ) చాలా మందికి తెలియదు.
విష్ణుమూర్తి శిలా రూపంలో మొదట ఇక్కడే వెలసినందుకు ఈ తిరుపతి ని తొలి తిరుపతి అని పిలుస్తారు ..
స్వయంభువు గా స్వామి వారు వెలసిన ప్రతి చోటా ఆళ్వారులు వుంటారు అలాగే ఇక్కడ కూడా గర్బాలయం పక్కన ఎడమ వైపు ఆళ్వారుల విగ్రహాలు వున్నాయి.
ఆలయ చరిత్ర :
--------------
ఒకానొకప్పుడు ఇప్పుడు తొలి తిరుపతి ఉన్న గ్రామమంతా కీకారణ్యం ధృవుని సవతి తల్లి అయిన సురుచి ధృవుని కి సింహాసనం దక్కకుండా కుతంత్రాలు నడుపుతున్నసమయంలో
ధృవుని తల్లి అయిన సునీతి నువ్వు సింహాసనం అధిష్టించి రాజ్యపాలన చేయాలంటే శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకోమని చెప్పిందట అప్పుడు ధృవుడు తపస్సు చేయడానికి ఈ కీకారణ్యం చేరుకున్నాడట.
అదే సమయంలో అక్కడ శాండిల్య మహాముని ఆశ్రమం ఉందట అప్పుడు ధృవుడు శాండిల్య మహాముని దర్శనం చేసుకుని శ్రీ మహా విష్ణువు యొక్క తపస్సు విదానం అడుగగా
ఆ ముని " నాయనా విష్ణుమూర్తి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని తలుచుకుంటూ తపస్సు చేయి" స్వామి ప్రత్యక్షమై నీ కోరిక నేరవేరుస్తాడు అని చెప్పి తపస్సుకి కావాల్సిన ఏర్పాటు చేసాడట.
ఆ మహాముని చెప్పినట్లే "దివ్య కాంతులతో శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించాడట" అయితే ఆ కాంతి ని చూడలేక ధృవుడు బయపడ్డాడట.
అప్పుడు విష్ణుమూర్తి నాయనా భయమెందుకు * నేనూ నీ అంతే వున్నాను కదా * అని నవ్వుతూ ధృవుని తలనిమిరి అతని భయాన్ని పోగొట్టాడట
ఆ తరువాత స్వామి ధృవుని కి దర్శనమిచ్చిన చోటే శిలా రూపంలో వెలిసాడట
స్వామి * నీ అంతే వున్నాను కదా * అని చెప్పినందుకు ఆలయ ప్రవేశ ద్వారం వద్ద గచ్చు మీద ఉన్న పుష్పం పై నుంచుని చూసిన వాళ్ళు ఎంత ఎత్తులో వుండి చూస్తే అంత ఎత్తులోనే దర్శనమిస్తాడు (చిన్న వాళ్లకు చిన్నవాడిగా పెద్దవాళ్ళకు పెద్ద వాడిగా)
ఆ అరణ్య ప్రాంతం లో వెలిసిన స్వామి ఎండకు ఎండి వానకు తడవడం చూసి దేవతలే స్వయంగా స్వామికి ఆలయాన్ని నిర్మించారు ఆ తరువాత శ్రీ లక్ష్మీ దేవి వారిని - నారద మహర్షి ప్రతిష్టించారట. తరువాత శ్రీ కృష్ణ దేవరాయల వారు భూదేవి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు (దీనికి శిలా శాసనాలే ఆధారం)
ఆలయ విశిష్టత :
------------------
1) చిద్విలాస వేంకటేశ్వరుడు (నవ్వుతున్నట్టుగా వుండే విగ్రహం )
2) విగ్రహం చిన్న పిల్లలకు చిన్నగానూ పెద్దవారికి పెద్దగానూ (ఎంత ఎత్తులో ఉండేవారికి అంతే ఎత్తులో కన్పిస్తుంది)
3) తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని విగ్రహానికి పూర్తి విభిన్నంగా శంఖ – చక్రాల స్థానం మారి వుంటాయి
4) ఆలయ ప్రాంగణం లోనే శివాలయం వైష్ణవాలయం రెండూ వున్నాయి.
5) సంతానం లేని దంపతులు ఆలయం వద్ద నూతిలో స్నానం చేసిన సంతాన ప్రాప్తి లబిస్తుంది.
6) ఏకశిలా కళా ఖండాలు... విగ్రహమూర్తి .. ఉత్సవ మూర్తి ... ప్రదాన ఆకర్షణ
 
కార్యక్రమాలు - పూజా విధానం :
-------------------------------
1) నిత్య ధూప దీప నైవేద్యం
2) ఉదయం 6 నుంచి రాత్రి 8 వరకూ దర్శనం
3) శ్రీరామ నవమి తరువాత వచ్చే మొదటి ఏకాదశి అనగా చైత్ర శుద్ద ఏకాదశి రోజు స్వామి వారి కళ్యాణం అంగ రంగ వైభవంగా .. ప్రారంభిస్తారు, ఆరోజు నుంచీ ఆరు రోజులపాటూ ఉత్సవాలు జరుపుతారు.
4) ధనుర్మాసం లో నెల రోజుల పాటూ పూజా కార్యక్రమాలు జరుగుతాయి.
 
చరిత్రలో స్వామి వారిని దర్శించుకొన్న ప్రముఖులు :
----------------------------------------------------
బోజమహా రాజు
బట్టీ విక్రమార్క
రాణీ రుద్రమదేవి
శ్రీ కృష్ణ దేవరాయలు
పెద్దాపురం - పిఠాపురం సంస్థాన మహారాజులు
లక్ష్మీ నర సాపురం రాజులు (లక్ష్మీ నరసాపురం రాజులు ఆలయానికి 600 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు కానీ ఇప్పుడు కేవలం 21 ఎకరాలు మాత్రమే గుడి పేర వున్నట్టు ... ఆలయం ప్రభుత్వ ఆదీనం లోనే ఉన్నప్పటికీ యాత్రికులకి... దర్శనానానికి .. బసకి సరైన సదుపాయాలు లేవు అని స్తానికులు బాధపడుతున్నారు) * మీ [[వంగలపూడి శివకృష్ణ]]
------------------------------------ అయిపొయింది - Completed --------------------------------
 
 
 
మన [[పెద్దాపురం]] లోని [[కాండ్రకోట]]ని కన్నులారా చూతము రారండి
-------------------------------------------------
 
పెద్దాపురం నుంచి 7 కిలోమీటర్లు (గుడివాడ, సిరివాడ ల మీదుగా స్వచ్చమైన పల్లెటూరి వాతావరం దారి పొడవునా రోడ్దుకిరువైపులా చెట్లు, చెట్లకి అవతల పచ్చని పంట పొలాలు..... వ్యవసాయానికి ఇప్పటికీ వాడుతున్న ఎద్దులు, రవాణాకి వాడుతున్న ఎద్దుల బండ్లు. వూరి మద్యలో రామాలయం - రామకోవెల (రాంకోలు) మీద అష్టా చమ్మా ఆడుతూ పిల్లలు ... దృశ్య శ్రవణ యంత్రం (టెలివిజన్ - టివి ) వీక్షిస్తున్న వృద్దులు, పెద్దలు... ఊరంతా కల్మషం లేని మనుసులు.ఆ మనుషులని కంటికి రెప్ప లా కాపాడే నూకాలమ్మ అమ్మవారు)
వెరసి కనీసం ఒక్కసారైనా కాండ్రకోట ని కన్నులారా చూడవలసిందే ....................
 
కొన్నివేల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాన్ని కిమ్మెర అనే స్వార్ధపరుడైన రాజు పరిపాలిస్తూ ప్రజలను రాక్షసంగా అనేక చిత్ర హింసలకు గురిచేసేవాడట అతను పెట్టె కష్టాలను ఓర్చలేక ప్రజలు సమీపం లో ఉన్న మరొక ధర్మాత్ముడైన మహా రాజు ధర్మకేతు ని ఆశ్రయించి రాక్షస రాజు కిమ్మెర బారి నుండి తమను రక్షించమని వేడుకొన్నారట అంతట ధర్మకేతు మహారాజు ప్రజా సంరక్షణార్ధం కిమ్మేరుని పై యుద్ధం చేసి దురధుష్టవసాత్తూ ఆ భీకర యుద్ధం లో ఓడిపోయారట !
 
ఆతని ఓటమి తరువాత ప్రజలపై కిమ్మేరుని పైశాచిక చర్యలు పెచ్చుమీరాయంట (అధికమయ్యాయి) ! ప్రజల యొక్క అవస్థలను చూసి సహించలేని ధర్మకేతు మహారాజు ఎలాగైనా కిమ్మెరుని వధించాలని ఆదిపరాశక్తి ని అంకుఠిత దీక్షతో ప్రార్ధించాడట. ఆతని తపస్సుకి మెచ్చి ఆది పరాశక్తి అమ్మవారు ప్రత్యక్షమై ఆమె అంశ ల లోని ఒక అంశ ను ధర్మకేతు మహారాజు తో పాటూ పంపిందట. ఆ యొక్క అంశ సహాయంతో ధర్మకేతు మహారాజు - స్వార్ధపరుడు, రాక్షస రాజైన కిమ్మెరుని ఓడించి - వధించి ప్రజలను కష్టాలనుంచి విముక్తులి చేసి రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించాడట. * మీ [[వంగలపూడి శివకృష్ణ]]
------------------------------------ అయిపొయింది - Completed --------------------------------
 
 
మన [[పెద్దాపురం]] - [[వంగలపూడి శివకృష్ణ]] వడ్ల గింజలు కథని ప్రముఖ రచయిత శ్రీపాద సుబ్రహణ్యశాస్త్రి గారు రచించారు. ఈ కథ 1941 సంవత్సరం ఆంధ్రవారపత్రిక లో ప్రచురించబడింది. శ్రీపాద సుబ్రహణ్యశాస్త్రి కథలు రెండవ సంపుటంలో ఈ కథను మరి కొన్ని మంచి కథలతో పాటూ మళ్ళీ ప్రచురించారు. కథలో వెళ్ళే ముందు రచయిత గురించి తెలుసుకొందాం.
 
రచయిత పరిచయం
శ్రీపాద సుబ్రహ్మణ్యం గారు ఏప్రిల్ నాలుగవ తేది తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకా పొలమూరులో జన్మించారు. వేదం, జ్యోతిష్యం, ధర్మ శాస్త్రాలను అభ్యసించి అవధానాలు కూడా చేసారు. వీరు పిఠాపురం సంస్థాన కవులు శ్రీ వేంకట రామకృష్ణ కవి గారి శిష్యులు. శ్రీపాద గారు సుమారు 75 కథలు వ్రాసారు. ఇంకా నాటకాలు, రేడియో నాటికలు, నవలలు, పద్య రచనలు కూడా చేసారు. శ్రీపాద గారి సాహిత్య సేవకు 1956 లో కనకాభిషేకం జరిగింది.
 
కథ
తణుకుకి చెందిన తంగిరాల శంకరప్ప చదరంగంలో దిట్ట. పెద్దాపురం మహరాజు దర్శనం కోసం శంకరప్ప కోటకు చేరుకుంటాడు. పేద బ్రాహ్మడయిన శంకరప్పకి కోటలోకి ప్రవేశం లభించదు. ఠానేదారు, దీవాంజీలు శంకరప్పకి కోటలోకి అనుమతి లభించకుండా అడ్డుపడి వీధిలోకి గెంటేస్తారు. దిగులుతో సత్రానికి చేరుకున్న శంకరప్పని చూసి పేదరాసి పెద్దమ్మ ఓదారుస్తుంది. మహరాజు దర్శనం సంపాదించడానికి ఉపాయం చెప్తుంది. ముందు పట్టణంలో పేరు తెచ్చుకుని తద్వారా మహరాజు దర్శనం సంపాదించమని హితబోధ చేస్తుంది. శంకరప్పకి జ్ఞానోదయం కలిగి ఊరి మీద పడతాడు.
 
అంచెలంచలుగా పెద్దాపురంలోని చదరంగ ప్రావీణ్యులనందరినీ ఓడించి, తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటాడు. ఊరిలో శంకరప్ప పేరు మారు మ్రోగుతుంది. ఈ వార్త చివరికి మహరాజుని చేరి, శంకరప్ప గురించి వాకబు చేస్తాడు. శంకరప్ప చదరంగ ప్రావీణ్యం గురించి తెలుసుకుని తనతో ఆడవలసిందిగా కబురు పంపుతాడు.పెద్దమ్మ ఆశీర్వాదం తీసుకుని శంకరప్ప పల్లకీలో కోటకు వెళ్ళి మహరాజుతో చదరంగం ఆడడానికి సిద్ధపడుతాడు. ఆటలో తను గెలిస్తే చదరంగంలో మొదటి గడిలో ఒక వడ్ల గింజ, రెండో గడిలో రెండు వడ్ల గింజలు, మూడో గడిలో నాలుగు వడ్ల గింజలు ఇలా చదరంగంలోని అన్ని గడులలో గింజలు రెట్టింపు చేసుకుంటూ ఇవ్వాలని కోరుతాడు.
 
చదరంగం ఆటలో మహరాజు శంకరప్పని ఓడించాడా? లేక శంకరప్ప గెలిచి తను కోరుకున్న వడ్లగింజలని రాజు దగ్గర నుండి అందుకున్నాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ కథ చదవాల్సిందే!
 
శ్రీపాద గారు కథలని నడిపించే విధానం చాలా బాగుంటుంది. మామూలుగా ప్రతి కథలో, నవలలో, నాటికలో రచయిత అపుడపుడూ మన ముందుకు వచ్చి కథ ఉద్దేశం చెప్తూ ఉంటారు. శ్రీపాద గారి కథలలో పాత్రలు మాట్లాడుకుంటూ కథని చెప్తూ ఉంటాయి. మాటలు ఎక్కడా ఆగవు, కథతో పాటూ మాటలు కూడా ఆగుతాయి. ఈ మాటలు కూడా వేగంగా తూటాల్లాగా పేలుతూ వెళ్ళిపోతాయి.
 
కథలో శంకరప్ప ప్రధానంగా నాలుగు, అయిదు ఆటలు ఆడుతాడు. ముందుగా వీధి అరుగులో ఆడుకుంటున్న ఒక ఇద్దరు చిన్న తరహా ఆటగాళ్ళయిన శాస్త్రి, యాజులుతో మొదలుపెట్టి చేయి తిరిగిన పోటుగాళ్ళతో ఆడే విధానం శ్రీపాద గారు మనకి కళ్ళకి కట్టినట్టు చెప్తారు. ఒక్కొక్క మెట్టు పైకి వెళ్ళే కొద్దీ ఆట కూడా వారి తరహాలో, వారి అంతస్థుకి తగినట్టు వారి ఇళ్ళు, భవనాలు ఉంటాయి. ఈ వ్యత్యాసాన్ని మనం బాగా దగ్గరగా చూడగలం ఈ కథలో. మూడు, నాలుగు ఎత్తుల్లో ఆట ముగించేసరికి శాస్త్రి, యాజులు శంకరప్పకి ప్రియ శిష్యులయిపోతారు. అప్పటినుండీ చివరివరకు గురువుగారిని అంటిపెట్టుకునే ఉంటారు.
 
రాజనర్తకి రంగనాయకి తన విటుడుతో ఆడే ఆటలో శంకరప్ప ఇంటి బయట నుండి గోడ చాటుగా వారి మాటలు వింటూ వారి ఆటలో పాల్గొనే సన్నివేశం చాలా ఆసక్తిగా ఉంటుంది. శంకరప్ప ఆటే కాదు, మాటలు కూడా పదునుగా ఉంటాయి. ఈ మాటలు పౌరుషంలో కోటలు దాటే విధంగా ఉంటాయి. దాట్ల అప్పల నరసింహారాజు గారి మేనల్లుడు విజయరామరాజుతో ఆడేముందు అతిథులకి మర్యాదలు, ఆడేటపుడు సపర్యలు అప్పటి కాలం రాచమర్యాదలని మనకి మళ్ళీ గుర్తు చేస్తాయి. ఆటలో శంకరప్ప ఏకాగ్రతకి భంగం కలిగించడానికి అతని పక్కన ఇద్దరు చక్కని చుక్కలని కూర్చుని తాంబూలం అందిస్తూ ఉంటారు. మహరాజుతో ఆడేటపుడు కూడా ఇంకొంచెం పెద్ద మోతాదులో ఈ మర్యాదలు ఉంటాయి. మహారాజుతో ఆట హోరాహోరీగా ఆరు నెలలపాటూ సాగడం, ఆట మధ్యలో వీరిద్దరి సంభాషణ మనల్ని బాగా ఆకట్టుకుంటాయి.
చివరగా వడ్లగింజల వరం కోరిక చదువుతూ ఉంటే మనకి సీతారామయ్య గారి మనవరాలు సినిమాలో మీనా కోరిక గుర్తుకు వస్తుంది. ఆ కోరికకి స్పూర్తి మన వడ్లగింజలు కథ నుండే అన్నమాట!