తెల్కపల్లి రామచంద్రశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''తెల్కపల్లి రామచంద్రశాస్త్రి''' సుప్రసిద్ధ సంస్కృత పండితుడ...'
 
పంక్తి 1:
'''తెల్కపల్లి రామచంద్రశాస్త్రి''' సుప్రసిద్ధ సంస్కృత పండితుడు. రాజాపురం శాస్త్రులుగా ప్రసిద్ధుడు.
==బాల్యము, విద్యాభ్యాసము==
సామాన్యమైన కుటుంబంలో పుట్టి, గురువుల క్రమశిక్షణలో ప్రకాశించి రాజాస్థానాలు చేరి ఉన్నతమైన విలువను పొందిన వారిలో తెల్కపల్లి రామచంద్రశాస్త్రి గారు ఒకడు. ఇతడు [[మహబూబ్‌నగర్ జిల్లా]], [[కోడేరు మండలం]] మండలం, [[రాజాపురం (కోడేరు)|రాజాపురం]] గ్రామంలో [[డిసెంబర్ 6]]న, [[1902]]లో శేషమాంబ, సుబ్రమణ్యం దంపతులకు జన్మించాడు. ఇంటి దగ్గరే వేదవిద్యను అభ్యసించి ఆ తరువాత [[వనపర్తి]], [[కర్నూలు]], [[శ్రీకాళహస్తి]], [[ఆకిరిపల్లి]], [[చిట్టిగూడూరు]], [[బందరు]]లలో ఎంతో మంది పండితప్రకాండుల వద్ద సుమారు పన్నెండేళ్లు సంస్కృత విద్యను అభ్యసించాడు.
 
==ఉద్యోగ ప్రస్థానం==
తాను చదువుకొన్న బందరు జాతీయ కళాశాలలో 1923లో ఒక సంవత్సరం అధ్యాపకుడిగా పనిచేసి ఆనాటి విద్యార్థులైన [[మరుపూరు కోదండరామిరెడ్డి]], వై.బి.రెడ్డి, [[బెజవాడ గోపాలరెడ్డి]], కౌతా ఆనందమోహన్, కౌతా రామమోహన్ వంటి ఉద్ధండుల మెప్పును పొందాడు. కర్నూలులో వెల్లాల శంకరశాస్త్రి ఇతని ప్రియశిష్యుడు. బందరు జాతీయ కళాశాలలో [[విశ్వనాథ సత్యనారాయణ]] ఇతనికి సహాధ్యాయి. ఉన్నవ లక్ష్మీనారాయణ కుమారుడైన అర్జునరావుకు ఇతడు సంస్కృతం నేర్పించాడు. 1921లో బెజవాడలో గాంధీని దర్శించాడు. గాంధీ విదేశీ వస్తు బహిష్కరణ పిలుపుననుసరించి ఖద్దరును ధరించాడు.