పరవస్తు వెంకట రంగాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
శ్రీ పరవస్తు వెంకట రంగాచార్యులు గారు [[1822]], [[మే 22]] న [[విశాఖపట్నం]]లో శ్రీనివాసాచార్యులు, మంగమ్మ దంపతులకు జన్మించాడు. ఈయన సకల శాస్త్ర పారము చూసిన మహా పండితులు సంస్కృతం మరియు ప్రాకృతం భాషలలో నిష్ణాతులు. విశాఖపట్నం లోని "గ్రంధ ప్రదర్శిని" నిర్వాహకులు.
వెంకట రంగనాధస్వామి అయ్యవార్లు (1875 -1918) రంగాచార్యుల వారి జేష్ఠ పుత్రులు. మహా మహోపాధ్యాయ బిరుద విరాజితులగు రంగాచార్యుల వారు తమ జీవిత చరమదశలో [[పెద్దాపురం సంస్థానసంస్థానం]] పరిశిష్టమైనటువంటి కోఠాం ఎస్టేటు వారి ఆస్థానమున పండితులుగా వుండిరి. <ref>ఆంధ్ర సంస్థానములు - సాహిత్య పోషణము - డా తూమాటి దోప్పన్న పేజి నం 275 యీయున్ని వేంకట వీర రాఘవా చార్యులు, పరవస్తు పండిత త్రయము, ఆంధ్రప్రత్రిక సంవత్సరాది సంచిక, అంగీరస, 1932, పుటలు, 181-184.</ref>
 
ఎనిమిదేళ్ల వయసులోనే సంస్కృతములో 'కుంభకర్ణ విజయము' అనే కావ్యమును రచించాడు. [[ఉర్లాం]], [[విజయనగరం]] మరియు [[మైసూరు]] మహారాజులు ఈయనను గౌరవించి సత్కరించారు. అన్నింటి కంటే మించి ఈయన శతావధానములో నిష్ణాతుడై ''మహా మహోపాధ్యాయ'' అన్న బిరుదు పొందినాడు. ఈయన తెలుగు సాహిత్యములో శ్రేష్ఠ గ్రంధాలుగా ఎన్నదగిన ''కమలిని కలహంసము'', ''వేద రహస్యము'' మరియు ''మంజుల నైషదము'' లను రచించాడు.