షేక్ నాజర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
 
"బుర్రకథా పితామహుడు"గా పేరొందిన '''షేక్ నాజర్''' ([[ఫిబ్రవరి 5]], [[1920]] - [[ఫిబ్రవరి 22]], [[1997]]) [[బుర్రకథ|బుర్రకథా]] కళాకారుడు, నటుడు, ప్రజా రచయిత మరియు గాయకుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత.

== జననం ==
[[గుంటూరు]] జిల్లా [[పొన్నెకల్లు]] గ్రామంలో ఓ పేద [[దూదేకుల]][[ ముస్లిం]] కుటుంబంలో [[1920]], [[ఫిబ్రవరి 5]] వ తేదీన జన్మించిన నాజరు పూర్తి పేరు '''షేక్ నాజరు వలి'''.
==బుర్రకథాపితామహుడు==
ప్రాచీన జానపద కళారూపమైన [[బుర్రకథ]]కు కొత్త జీవం పోసి, మెరుగులు దిద్ది, ప్రత్యేక ఆహార్యంతో తగిన హావ భావలతో ఎన్నో ప్రదర్శనలిచ్చి బుర్రకథా ప్రక్రియకు విస్తృత ప్రచారం కల్పించిన బుర్రకథా పితామహుడు నాజర్, గొప్పనటుడు, ప్రజారచయిత, మహాగాయకుడు. " ఈ గండపెండేరాలూ, ఊరేగింపులూ, సన్మానాలూ, పద్మశ్రీలూ అన్నీ కలిపి, నాకు జనం వేసే ఒక్క ఈలతో సాటి కాదు" అని తన కళను ప్రజా ప్రయోజనానికే అంకితం చేసిన ప్రజా కళాకారుడు.
తెనాలిలోని బాలరత్న నాటక సమాజంలో ప్రారంభమైన నాజర్ కథాకథన ప్రస్థానం నాలుగు దశాబ్దాలు సాగింది.కమ్యూనిస్టు పార్టీలోచేరి [[ప్రజానాట్యమండలి]] వేదిక ద్వారా పార్టీ సిద్ధాంతాలను కార్యక్రమాలను బుర్రకథల ద్వార ప్రచారం చేశాడు. వీరిని 1940వ దశకంలో కమ్యూనిస్టు పార్టీ నెల జీతంమీద కథలు చెప్పించి పల్లెలలో తమ పార్టీ ప్రచారానికి ఉపయోగించుకున్నది. పల్నాటి యుద్ధం , వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు ,ప్రహ్లాద, క్రీస్తు, బెంగాల్ కరువు మొదలగు ఇతివృతాలలో నమకాలీన రాజకీయాలు జోడించి బుర్రకథలు రూపొందించాడు. 'అసామి ' అనే నాటకం రాసి ప్రదర్శనలిచ్చాడు. బుర్రకథ పితామహుడు పద్మశ్రీ నాజర్ జీవిత చరిత్రను [[అంగడాల వెంకట రమణమూర్తి]] అనే ఆయన [[పింజారీ]] అనే పుస్తకంగా ప్రచురించాడు. [[పుట్టిల్లు]], [[అగ్గిరాముడు]], చిత్రాలలో బుర్రకథలు చెప్పాడు. [[నిలువుదోపిడి]], [[పెత్తందార్లు]] చిత్రాలకు పనిచేసాడు. కొంతకాలం [[విరసం]] సభ్యుడు.
 
==కళాప్రతిభ==
"https://te.wikipedia.org/wiki/షేక్_నాజర్" నుండి వెలికితీశారు