సంతనూతలపాడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 146:
===శ్రీ అంకమ్మ తల్లి అమ్మవారి ఆలయం===
స్థానిక రజకపాలెంలోని అంకమ్మతల్లి ఆలయంలో 2014, జూన్-22, ఆదివారం నాడు పొంగళ్ళకార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించినారు. స్థానిక కొత్తపల్లి, పమిడిపల్లి వంశస్తుల ఆధ్వర్యంలో ప్రత్యేకపూజా కార్యక్రమాలు నిర్వహించినారు. 20వ తేదీ శుక్రవారం నాడు అమ్మవారికి సముద్రస్నానం, 21వ తేదీన గ్రామోత్సవం, 22వ తేదీ ఆదివారం నాడు పొంగళ్ళ కార్యక్రమం నిర్వహించినారు. ఆదివారం రాత్రి ప్రత్యేకంగా విద్యుత్తు వెలుగులలో చిత్రాన్ని ఏర్పాటుచేసినారు. ఈ కార్యక్రమలో భక్తులు ప్రత్యేకపూజలు నిర్వహించినారు. [8]
 
ఈ ఆలయ ప్రథమ వార్షిక ఉత్సవ వేడుకలను 2016,ఫిబ్రవరి-16వ తేదీ మాఘ శుద్ధ మంగళవారంనాడు ప్రారంభించినారు. ఈ ఉత్సవాలు 18వ తేదీ గురువారం వరకు నిర్వహించెదరు. [9]
 
===శ్రీ సీతారామాలయం===
సంతనూతలపాడులోని పెద్దబజారులో ఉన్న ఈ ఆలయంలోని సీతారాముల నూతన ఉత్సవ పంచలొహ విగ్రహాలకు మహా సంప్రోక్షణ కార్యక్రమం, 2015,మార్చ్-27వ తేదీ శుక్రవారం నాడు, ఘనంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించినారు. 28వ తేదీ శనివారం, శ్రీరామనవమి నాడు, శ్రీ సీతారాముల కళ్యాణమహోత్సవాన్ని నిర్వహించెదరు. [10]
"https://te.wikipedia.org/wiki/సంతనూతలపాడు" నుండి వెలికితీశారు