ఉస్తాద్ బిస్మిల్లాఖాన్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:సుప్రసిద్ద సంగీతకారులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
కాపీహక్కుల ఉల్లంఘన, కవిత నేరుగా ప్రచురణ
పంక్తి 8:
== షెహనాయ్ ప్రస్థానం ==
1937 లో [[కోల్‌కతా]] భారతీయ సంగీత సమ్మేళనం లో షెహనాయికి మంచి ప్రాచుర్యాన్ని తీసుకొని వచ్చాడు. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలలో ఆయన తన కచేరీల నిచ్చాడు. ఆయన చనిపోయినప్పుడు, షెహనాయీని ఆయనతో పాటే పూడ్చిపెట్టారు. అంతగా అనుబంధం వుండేది ఆయనకు షెహనాయీతో. ఆయన ఇలా అనేవాడు, ''మానవాళి నశించినా, సంగీతం బతుకుతుంది. సంగీతానికి కులం లేదు'', అని.
==అతనొక మహా శివరాత్రి ==
భగవద్గీత చదవలేదు
ఖురాను కంఠస్తం చెయ్యలేదు
కానీ అతనొక మహా శివరాత్రి
కాశీ విశ్వేశ్వరాలయంపైన నెలవంకను తగిలించాడు
 
మానస సరోవరాల ఘనీభవనంతెలియదు
మనుషులు శిలలుగా మారే వైనం కూడా తెలీదు
కాని అతను శిలలను ద్రవీకరించె అద్భుత ప్రక్రియ కనుగొన్నాడు
 
గాత్రంతొ గారడీలు చెయ్యలేదు
స్తోత్రపారాయణాలూ చెయ్యలేదు
కానీ అతను
మనుషుల పందిరిమీద
సప్తసువాసనల లతనెదో పాకించాడు
 
నదీ స్నానాలు చెయ్యలేదు
కొండలు గుట్టలు ఎక్కలేదు
కాని అతను
గంగాబాలను తన ముంగాళ్ళమీద
సురస్వరాల ఉయ్యాలలూగించాడు
 
ఏకాంత మానవద్వీపాలు చూడలేదు
విచ్ఛిన్న శకలాల గూర్చి వినలేదు
కాని అతను
ఒకేసారి అరవై మందిని
ఉమ్మడి గా వాటేసుకున్నాడు
 
మహా దార్శనికుడేమీకాడు
ప్రవక్త అంతకన్నా కాడు
కానీ అతను
గుండెనిలువునా తెరిచి
తన జాతి ఆత్మను ప్రపంచానికి ప్రదర్శించాడు
అతను బిస్మిల్లా ఖాన్ ---------పాపినేని శివశంకర్, ప్రజా సాహితి ,డిశంబర్ 2006
 
== ఎర్రకోటలోవాద్యం ==