యలవర్తి నాయుడమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్రప్రదేశ్ శాస్త్రవేత్తలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 21:
[[గుంటూరు]] జిల్లా [[యలవర్రు]] గ్రామములో ఒక వ్యవసాయ కుటుంబములో [[సెప్టెంబరు 10]], [[1922]] న జన్మించాడు. గ్రామ పాఠశాలలో ప్రాథమిక విద్య అభ్యసించిన పిమ్మట గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివాడు. 1943 లో కాశీ హిందూ విశ్వవిద్యాలయములో రసాయన టెక్నాలజిలో ఉన్నతవిద్యనభ్యసించి [[మద్రాసు చర్మ టెక్నాలజీ సంస్థ]]లో ప్రత్యేక విద్య గరపి అదే సంస్థలో అంచెలంచెలుగా ఎదిగి డైరెక్టరు అయ్యాడు. 1958 నుండి 1971 వరకు సుదీర్ఘకాలము డైరెక్టరుగా ఉన్నాడు. తన ఆధ్వర్యములో చర్మపరిశోధనా సంస్థను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళాడు. అమెరికా లోని లీ హై యూనివర్సిటీ లో అంతర్జాతీయ చర్మ శుద్ధి అంశం మీద డాక్టరేట్ (పి.హె.డి) డిగ్రీ పొందారు.
== పరిశోధనలు==
[[అమెరికా]] లోని చర్మ పరిశుభ్రం చెసే పరిశ్రమలో అఖండ పరిశోధనలు చేసి, అధ్భుత విజయాలను సాధించారు. 1943-45 నడుమ కాలంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ(మద్రాసు) లో శాస్త్రవేత్తగా చేసిన పరిశోధనలు మేళవించగా, అమెరికా లో చేసిన పరిశోధనా కృషి ఫలవంతమైనది. తిరిగి మాతృదేశానికి వచ్చి, 1951 లో సెంట్రల్ లెదర్ రీసెర్చ్ యూనివర్సిటీ లో శాస్త్రవేత్తగా చేరారు. ఎన్నో నూతన లాభదాయక ప్రణాళికలను రూపొందించి చర్మకార పరిశ్రమను అభివృద్ధి చేశారు. కేంద్ర చర్మ పరిశోధనా సంస్థనూ సాటిలేని పరిశోధనా సంస్థగా రూపొందించారు. ఈ సంస్థ జాతీయ స్థాయికి ఎదిగి పారిశ్రామిక అభివృద్ధి లోనూ, గ్రామీణ అభివృద్ధిలోనూ గణనీయమైన పాత్ర పోషించింది. 1956 లో డైరక్టర్ గా పదోన్నతి పొందారు.
 
==ప్రతిష్టాత్మక హోదాలు==
సామాన్య రైతు కుటుంబంలో పుట్టి పెరిగి శాస్త్ర సాంకేతిక రంగంలో ఉన్నత శిఖరాలను చేరుకొని మన దేశానికి ఖ్యాతిని ఆర్జించి పెట్టిన ప్రొఫెసర్ నాయుడమ్మ పలు ప్రతిష్టాత్మక హోదాలను అందుకున్నారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (న్యూఢిల్లీ) సంస్థకు డైరక్టరు జనరల్ (1971-77) గా ఉన్నారు. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (న్యూఢిల్లీ) కి వైస్ ఛాన్సలర్ (1981) గా ఉన్నారు. మద్రాసు యూనివర్సిటీకి గౌరవాచార్యులుగా సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (మద్రాసు) కు డిస్టింగ్విష్ శాస్త్రవేత్తగా (1977) గా పలు సంస్థలలో వివిధ బాధ్యతాయుతమైన పదవులు నిర్వహించారు.
"https://te.wikipedia.org/wiki/యలవర్తి_నాయుడమ్మ" నుండి వెలికితీశారు