మీర్ తురాబ్ అలీ ఖాన్, సాలార్ జంగ్ I: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
ఐదవ నిజాం అఫ్జలుద్దౌలా కాలంలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మొదటి సాలార్ జంగ్, ఆయన మరణానంతరం పసిపిల్లవాడైన ఆరవ నిజాం మహబూబ్ అలీఖాన్ కు పద్నాలుగేళ్ళ పాటు మంత్రిత్వం నెరపారు. తరాలుగా రాజ్యంలో బ్రిటీష్ ప్రతినిధి అయిన రెసిడెంట్, భారతదేశంలో బ్రిటీష్ పరిపాలన నెరపే వైశ్రాయ్/గవర్నర్ జనరల్ ల మాటకు ఎదురు లేని హైదరాబాద్ రాజ్యంలో మొదటి సాలార్ జంగ్ మాత్రం దృఢమైన వ్యక్తిత్వంతో తనకు ఇష్టంవచ్చిన సంస్కరణలు అమలుచేశారు. ప్రభుత్వంలో ఏర్పడిన అస్తవ్యస్త పరిస్థితులు, అలసత్వం చక్కదిద్దుతూ పాలనాపరమైన సంస్కరణలకు నాంది పలికారు. మొత్తం ప్రభుత్వాన్ని తన పట్టులో నిలుపుకుని ప్రభావశీలమైన కృషిచేశారు.
== తొలినాళ్ళ జీవితం ==
మీర్ తురాబ్ అలీ ఖాన్ బీజాపూర్ లో 1829 సంవత్సరంలో ఉన్నత ముస్లిం కుటుంబంలో జన్మించారు. ఆయన వంశం తొలినాళ్ళ నుంచి భారతీయ రాజకీయాల్లో ప్రముఖమైనదేప్రముఖమైనది. [[బీజాపూర్]] సుల్తానులైన [[ఆదిల్‌షాహీ వంశము|ఆదిల్‌షాహీల]] వద్ద, ఆపైన [[ఢిల్లీ]] చక్రవర్తుల వద్ద, చివరకు [[హైదరాబాద్ రాజ్యం|హైదరాబాద్]] [[నిజాం|నిజాంల]] వద్ద పనిచేశారు.