లాలుపురం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 113:
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#లాలుపురం గ్రామంలో మొదట రెండు దేవాలయాలు మాత్రమే ఉండగా ప్రస్తుతం 11 దేవాలయాలు ఉన్నవి. పది సంవత్సరాలలో గ్రామస్తులు, చేయీ చేయీ కలిపి, తలా కొంత సొమ్ము వెచ్చించి, ఆలయాలను నిర్మించి, ప్రతి సంచత్సరం ఉత్సవాలు నిర్వహించుటయేగాక, ప్రత్యేకపూజలతోపాటు, అన్నదానం గూడా నిర్వహించుచున్నారు. ఈ గ్రామంలో ఏ మూల చూసినా, ఏదో ఒక ఆలయం దర్శనమిస్తుంది. ఈ గ్రామంలో శివాలయం, శ్రీకృష్ణదేవాలయం, శాకంబరీఅమ్మవారి ఆలయం, ఆంజనేయస్వామి దేవాలయం, షిర్డీసాయిబాబా మందిరం, శ్రీ లక్ష్మీతిరుపతమ్మ సమేత గోపయ్యస్వామి ఆలయం, వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించుకున్నారు. వెలివెల్లివారిపాలెం, వీరన్నపాలెం గ్రామాలలో ఆంజనేయస్వామి ఆలయాలు నెలకొల్పినారు. తూర్పు బజారు చెరువుకట్ట ప్రాంతములో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయం నిర్మించినారు. [6]
#శ్రీ శాంకరీ సమేత సిద్ధ గణపతి, సాయిబాబా ఆలయం;- లాలూపురం గ్రామములోని శ్రీ శాంకరీ సమేత సిద్ధ గణపతి, సాయిబాబా ఆలయంలో జీవ, ధ్వజస్థంభ ప్రతిష్ఠా మహోత్సవాలు 2014,ఫిబ్రవరి-22, శనివారం నుండి మూడురోజులపాటు జరిగినవి. శనివారం ఉదయం నవగ్రహాలు, ఉత్సవమూర్తులతోపాటుగా ఆంజనేయస్వామి, కుమారస్వామివార్ల విగ్రహాల ఊరేగింపు జరిగినవి. ఆదివారం దీక్షాహోమం, జలాధివాసం, ప్రధాన దేవతా జపాలు జరిగినవి. సోమవారం ఉదయం 10-46 గంటలకు, జీవధ్వజస్థంభంతోపాటుగా, విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం, తదనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించినారు. ఈ మూడురోజులూ రాత్రికి భజన కార్యక్రమం జరిగింది. [2]
#శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయం:- లాలుపురం చెరువుకట్ట సమీపంలోని ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం మాఘశుద్ధపౌర్ణమికి శ్రీ గోపయ్యస్వామి, శ్రీ లక్స్మీతిరుపతమ్మ అమ్మవారల కళ్యాణం వైభవంగా నిర్వహించెదరు. ఈ ఆలయంలో, 2014, జూన్-24, మంగళవారం నాడు, ఈ ఆలయ నాల్గవ వార్షిక వేడుకలను వైభవంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా స్వామివార్లకు, తొమ్మిది రకాల అభిషేకాలు, ప్రత్యేకపూజలు నిర్వహించినారు. సాయంత్రం, తుళ్ళూరు మండలం, నెక్కల్లు బృందం వారిచే, అమ్మవారి బుర్రకథా కార్యక్రమాన్ని, ఏర్పాటుచేసినారు. ఈ కార్యక్రమానికి మహిళా భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. [5]
#శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం:- లాలూపురం వీరన్నపాలెంలోని శ్రీ అభయాంజనేయస్వామివారిఅభయాంజనేయస్వమివారి ఆలయంలో, ప్రధమ వార్షికోత్సవాలు, 2014,మే-18 నుండి 25 వరకు నిర్వహించెదరు. [3]
#శ్రీ కృష్ణమందిరము:- ఈ మందిర మొదటి వార్షికోత్సవ వేడుకలు, 2014,జూన్-1,2,3 తేదీలలో నిర్వహించినారు. ఈ మూడురోజులూ స్వామివారికి ప్రత్యేకపూజలు, అలంకారాలు ఏర్పాటు చేయడమేగాక, విష్ణుసహస్రనామ పారాయణ తదితర పూజలు నిర్వహించినారు. ఈ సందర్భంగా ఆలయప్రాంగణంలో రాధాకృష్ణ, శ్రీకృష్ణుని లీలలకు సంబంధించిన పలు చిత్రాలను ఏర్పాటు చేసినారు. ఆఖరిరోజు మంగళవారం నాడు భక్తులకు అన్నదానం నిర్వహించినారు. సాయంత్రం స్వామివారి ప్రతిమను గ్రామవీధులలో ఊరేగించినారు. ఈ సందర్భంగా భజన కార్యక్రమం నిర్వహించినారు. ఉత్సవాల సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నది. [4]
#శ్రీ సీతారామస్వామివారి ఆలయం:- గతంలో ఈ ఆలయం శిధిలావస్థకు చేరటంతో, గ్రామస్థుల విరాళాలతో నూతన ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టినారు. ఆలయంలో సీతారాములతోపాటు, గణపతి, ఆంజనేయస్వామి విగ్రహాల ప్రతిష్ఠకు, మూడు ఉపాలయాలను గూడా అంతరంగా నిర్మించుచున్నారు. ప్రస్తుతం నిర్మాణ పనులు గోపురం దశకు చేరుకున్నవి. 2015, ఏప్రిల్ లో శ్రీరామనవమికి, విగ్రహ ప్రతిష్ఠ చేయుటకు చర్యలు తీసికున్నారు. [7]
#శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి ఆలయం:- ఈ ఆలయం గ్రామంలోని గాంధీ విగ్రహం కూడలిలో ఉన్నది.
#శ్రీ పోలేరమ్మ తల్లి తల్లి ఆలయం.
#శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం:- ఈ ఆలయ అష్టమ వార్షికోత్సవాలు, 2016,ఫిబ్రవరి-26వ తేదీ శుక్రవారంనాడు వైభవంగా నిర్మించినారు. []
 
==గ్రామములోని ప్రధాన పంటలు==
"https://te.wikipedia.org/wiki/లాలుపురం" నుండి వెలికితీశారు