రాంరెడ్డి వెంకటరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''రెడ్డి వెంకటరెడ్డి''' ఖమ్మం జిల్లా పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎంపికైన ఆయన వైఎస్ రాజశేఖరరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిల హయాంలో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం రాంరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ పీఏసీ చైర్మన్ గా ఉన్నారు.<ref>[http://apdunia.com/nomore-ramreddy-venkata-reddy/ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి ఇకలేరు]</ref>
==జీవిత విశేషాలు==
ఈయన స్వస్థలం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం [[పాతలింగాల]] గ్రామం. 1967లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1967 నుంచి 1977 వరకు పాతలింగాల సర్పించిగా ఉన్నారు. ఎల్ఎంబీ డైరెక్టర్, డిసిసి ఉపాధ్యక్షులుగా పని చేశారు. 1996లో ఉప ఎన్నిక ద్వారా సుజాత నగర్ ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసారు. వెంకట్ రెడ్డి 2009, 2014లలో [[పాలేరు శాసనసభ నియోజకవర్గం]] నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 నుంచి 2014 వరకు మంత్రిగా పని చేశారు.<ref>[http://telugu.oneindia.com/news/telangana/congress-mla-ramreddy-venkat-reddy-dies-174057.html కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి కన్నుమూత]
</ref>
 
==వ్యక్తిగత జీవితం==
రాంరెడ్డి వెంకటరెడ్డికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దామోదర్ రెడ్డి స్వయాన ఆయనకు సోదరుడు.