రాంరెడ్డి వెంకటరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''రెడ్డి వెంకటరెడ్డి''' ఖమ్మం జిల్లా పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎంపికైన ఆయన వైఎస్ రాజశేఖరరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిల హయాంలో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం రాంరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ పీఏసీ చైర్మన్ గా ఉన్నారు.<ref>[http://apdunia.com/nomore-ramreddy-venkata-reddy/ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి ఇకలేరు]</ref>
==జీవిత విశేషాలు==
ఈయన స్వస్థలం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం [[పాతలింగాల]] గ్రామం. 1967లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1967 నుంచి 1977 వరకు పాతలింగాల సర్పించిగా ఉన్నారు. ఎల్ఎంబీ డైరెక్టర్, డిసిసి ఉపాధ్యక్షులుగా పని చేశారు. 1996లో ఉప ఎన్నిక ద్వారా సుజాత నగర్ ఎమ్మెల్యే అయ్యారు. 1999lలో జరిగిన ఎన్నికలలో సుజాతానగర్ శాసనసభ సభ్యునిగా ఎన్నికైనారు.<ref>[http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/1999-election-results.html Andhra Pradesh Assembly Election Results in 1999]</ref> ఆ తర్వాత నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసారు. వెంకట్ రెడ్డి 2009, 2014లలో [[పాలేరు శాసనసభ నియోజకవర్గం]] నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 నుంచి 2014 వరకు మంత్రిగా పని చేశారు.<ref>[http://telugu.oneindia.com/news/telangana/congress-mla-ramreddy-venkat-reddy-dies-174057.html కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి కన్నుమూత]
</ref>