అన్నదాత (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
art = [[టి.వి.యస్.శర్మ]] |
}}
'''అన్నదాత''' చిత్రం అశ్వరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై 1954 డిసెంబరు 17న విడుదలైంది.
==నటీనటులు==
* అక్కినేని నాగేశ్వరరావు
* అంజలీదేవి
* ఎస్.వి.రంగారావు
* చలం
* అమ్మాజీ
* శివరామకృష్ణయ్య
* కుటుంబరావు
* దొరస్వామి
 
==కథ==
కరువుకాటకాలతోనూ, జమీందారీ నిరంకుశత్వంతోనూ సతమతమవుతున్న గ్రామప్రజలను బంగారయ్య (అక్కినేని నాగేశ్వరరావు) అనే యువకుడు సమీకరించి, వారిలో సంఘీభావం పెంపొందించి, బీళ్లన్నీ దున్నించి,పంటలు పండించి కరువు దూరమయ్యేటట్టు చేస్తాడు. వ్యర్థంగా సముద్రంలో కలిసి పోతున్న నదీజలాలకు ఆనకట్ట కడితే క్షామపీడ శాశ్వతంగా తొలగిపోతుందని సంకల్పిస్తాడు. స్వతహాగా మంచివాడైన జమీందారు (శివరామకృష్ణయ్య) అతడికి ఆర్థిక సహాయం చేయడమే కాకుండా ఇంజనీర్లను కూడా తోడుగా ఇస్తాడు. కొన్నేళ్ల నిరంతర కృషి ఫలితంగా గ్రామ ప్రజల సహకారంతో ఆనకట్ట పూర్తి అవుతుంది. బంగారయ్య కల ఫలిస్తుంది. అందరూ బంగారయ్యను అన్నదాత అని కీర్తిస్తారు. ఈ కథ ప్రారంభంలో బంగారయ్య క్షామపీడితులకు గంజికేంద్రం నడుపుతాడు. అతనికి శాంత (అంజలీ దేవి) అనే దిక్కులేని యువతి సహాయపడుతుంది. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. వారికొక ఆడపిల్ల పుడుతుంది. గంజికేంద్రానికి ధనసేకరణ కోసం నాటకాలు వేస్తే బాగుంటుందని తలచి వారు కామయ్య నాయుడు(ఎస్.వి.రంగారావు) సహాయం కోరతారు. కొంతకాలం తర్వాత కామయ్యనాయుడుకూ, తన భార్యకూ అక్రమసంబంధం ఉందని అనుమానించి బంగారయ్య భార్యను, బిడ్డను విడిచి వెళ్లిపోతాడు. కామయ్యనాయుడు తన భార్యకు పుట్టిన కోతిలాంటి నల్లపిల్లను తనకు తెలియకుండా శాంతకు అంటగట్టి ఆమె బిడ్డను తన భార్యకు ఇస్తాడు. శాంత కూతురు అన్నపూర్ణ (అమ్మాజీ) కామయ్యనాయుడు వద్ద పెరిగి పెద్దదవుతుంది. ఆమెను రంగబాబు (చలం) అనే ఆకతాయికి ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయిస్తారు. ఆ పిల్ల మాత్రం వేణుగోపాలస్వామి ఆలయంలో దేవదాసిగా జీవితం గడపాలనుకుంటుంది. కామయ్య నాయుడు కూతురైన నల్ల పిల్ల శాంత వద్ద పెరుగుతుంది. ఆ పిల్లను రంగబాబు వలలో వేసుకుని చెరుస్తాడు. జమీందారు గారి మరణం తరువాత వారసుడైన రంగబాబు చేతికి జమీందారీ వస్తుంది. అతనికి కామయ్యనాయుడు సలహాదారుడవుతాడు. అన్నపూర్ణను బలాత్కారంగా రంగబాబుకిచ్చి పెళ్లి చేయసంకల్పిస్తాడు కామయ్యనాయుడు. కానీ బంగారయ్య అడ్డుపడి ఆమెను రక్షిస్తాడు. బంగారయ్యమీద కక్ష తీర్చుకోవడానికి జమీందారు రంగబాబు కొత్తగా కట్టిన ఆనకట్టను ధ్వంసం చేయాలని చూస్తాడు. అతని మనుషులు ఆనకట్టను ధ్వంసం చేయబోగా బంగారయ్య అడ్డుకుంటాడు. కామయ్య నాయుడి కుతంత్రాలను చివరకు రంగబాబు గ్రహించి పశ్చాత్తాపపడతాడు. శాంత సౌశీల్యవతి అని గ్రహించి బంగారయ్య ఆమెను స్వీకరిస్తాడు. రంగబాబు నల్లపిల్లను పెళ్లిచేసుకుంటాడు. కామయ్య నాయుడు కూడా చివరకు పశ్చాత్తాపపడి మంచివాడుగా మారిపోతాడు<ref>[http://pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=22803 ఆంధ్రసచిత్రవారపత్రిక 29-12-1954 పేజీలు 49-51 అన్నదాత సమీక్ష]</ref>.
==పాటలు, పద్యాలు==
ఈ చిత్రంలో ఈ పాటలున్నాయి.<ref>[http://ghantasalagalamrutamu.blogspot.in/2011/01/1954_07.html ఘంటసాల గళామృతము బ్లాగులో అన్నదాత పాటల జాబితా]</ref>
# ఒంటరి వాడనే భామ నా చెంతగూడవే భామా - [[పిఠాపురం|పిఠాపురం నాగేశ్వరరావు]], [[పి.సుశీల]]
# కస్తూరి రంగ రంగా మాయన్న కావేటి రంగ రంగా మా యన్న - [[జిక్కి]]
"https://te.wikipedia.org/wiki/అన్నదాత_(సినిమా)" నుండి వెలికితీశారు