"చీమకుర్తి" కూర్పుల మధ్య తేడాలు

#శ్రీ హరిహర క్షేత్రo:- చీమకుర్తి గ్రామములోని శ్రీ హరిహర క్షేత్ర 8వ వార్షికోత్సవ వేడుకలు, శ్రీ శిద్దా వెంకటేశర్లు,వెంకటసుబ్బమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో, 2014,ఏప్రిల్-13, ఆదివారం నాడు, వైభవంగా ప్రారంభమైనవి. ఆ రోజున మహాగణపతిపూజ, పుణ్యాహవచనం, దీక్షాధారణ, మండపారాధన, మహాపడిపూజలు నిర్వహించినారు. సోమవారం నాడు శ్రీ హరిహరసుత అయ్యప్ప, శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి, వాసవీ కన్యకా పరమేశ్వరి, పార్వతీ సమేత నగరేశ్వరస్వామి, ప్రసన్నాంజనేయస్వామివార్ల విశేష అభిషేకాలు, హోమాలు నిర్వహించెదరు. ఈ సందర్భంగా దేవాలయంలో రంగురంగుల విద్యుద్దీపాలంకరణ చేశారు. శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయంలో ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి సందర్భంగా మే నెలలో, రెండు రోజులపాటు వేడుకలు నిర్వహించెదరు. [4] & [5]
#శ్రీ నగరేశ్వరస్వామివారి ఆలయం:- స్థానిక శిద్దావారి వీధిలోని ఈ ఆలయంలోని శివలింగాన్ని, 2015,మార్చ్-17వ తేదీ మంగళవారం ఉదయం 6-40 ప్రాంతాలలో భానుని కిరణాలు తాకినవి. రెండు రోజుల క్రితం గూడా ఈ రీతిలో సూర్యకిరణాలు, గర్భాలయంలోని శివలింగాన్ని తాకినవి. ఈ నేపథ్యంలో పలువురు భక్తులు ఆలయాన్ని సందర్శించినారు. [13]
#శ్రీ గంగా పర్వతవర్ధనీ సమేత శ్రీ సాక్షి రామలింగేశ్వరస్వామివారి ఆలయం:- చీమకుర్తి పట్టణం ఇసుకవాగు సమీపంలోని ఈ ఆలయంలో, 2016,ఫిబ్రవరి-27వ తేదీ శనివారంనాడు, స్వామివారి శాంతికళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించినారు. అనంతరం భక్తులకు అనప్రసాద వితరణ నిర్వహించినారు. 28వ తేదీ ఆదివారంనాడు, బాజభజంత్రీలు, బాణాసంచా వెలుగుజిలుగుల సంస్కృతిక కార్యక్రమాల నడుమ, స్వామివారి నగరోత్సవం వైభవంగా నిర్వహించినారు. [18]
#శ్రీ లక్ష్మీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం.
#శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం:- చీమకుర్తి పట్టణంలోని రచ్చమిట్ట ప్రాంతంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయ నిర్మాణానికి, దాత శ్రీ మారం వెంకటసుబ్బారెడ్డి, స్థలాన్ని విరాళంగా అందజేసినారు. దాతల విరాళాలతో ఆలయ నిర్మాణం జరిగినది. ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాకార్యక్రమాలు 2014,జూన్-9 వ తేదీ మద్యాహ్నం 3 గంటల నుండి ప్రారంభం చేసెదరు. విఘ్నేశ్వరపూజ, మంగళస్నానాలు, అనంతరం పాలరాతితో చేసిన శ్రీ షిర్డీసాయినాధుని మూలవిరాట్టుకు గ్రామోత్సవం నిర్వహించెదరు. ప్రతిష్ఠా మహోత్సవాన్ని పురస్కరించుకొని మూడురోజులపాటు మహాకుంభాభిషేకాన్ని నిర్వహించుచున్నారు. 72 మంది దంపతులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. 13వ తేదీ ఉదయం 7=21 గంటలకు శ్రీ షిర్డీ సాయినాధ, దత్తాత్రేయ, గణపతి,శిఖర ప్రతిష్ఠ నిర్వహించెదరు, ఈ సందర్భంగా 25 వేలమందికి అనందానం నిర్వహించెదరు. [6]&[7]
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1852628" నుండి వెలికితీశారు