సంకీర్తన (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
సంకీర్తన కోణార్క్ మూవీ క్రియేషన్స్ పతాకంపై అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, శరత్ బాబు ప్రధాన పాత్రల్లో నటించగా గీతాకృష్ణ దర్శకత్వం వహించిన 1987నాటి తెలుగు చలన చిత్రం.
== కథ ==
ఓ పల్లెటూళ్ళో జాలరి కులానికి చెందిన కాశి (అక్కినేని నాగార్జున) అజ్ఞాత కవి, గాయకుడు. కాశిలోని ప్రతిభ పెద్దగా ఎవరకీ తెలియదు. తల్లి (డబ్బింగ్ జానకి) జాలరిగా పనిచేస్తూంటుంది, కాశికి ఉద్యోగం ఉండదు, ఎప్పుడూ ప్రకృతిలో విహరిస్తూ తన కవితా గానం చేస్తూ తిరుగుతుంటాడు. అతనికిపెద్ద కులానికి చెందిన కీర్తన (రమ్యకృష్ణ)ని నిజానికి పిల్లలు లేని వాసుదేవ మూర్తి (జె.వి.సోమయాజులు) గుడిమెట్లపై దొరికితే తెచ్చుకుని పెంచుకుంటూంటాడు. కానీ కీర్తన తమ సొంత కూతురు కాకపోవడంతో వాసుదేవమూర్తి భార్యకు ఆమెపై అక్కసు, వ్యతిరేకత ఉంటుంది. ఇదిలావుండగా ఆ ఊరి జనం దేవతలా భావించి కొలుస్తూ ఉంటారు. ఆమె అడుగుపెట్టాకే తమ కడగళ్ళు పోయాయని, గ్రామం సుభిక్షమైందని నమ్ముతూంటారు. సంవత్సరానికి ఒకసారి అమ్మవారి జాతరలో కీర్తన నాట్యం చేస్తూంటుంది, ఆమెకు నాట్యశాస్త్ర గురువు పరమేశ్వరశాస్త్రి (గిరీష్ కర్నాడ్). అలాంటి ఓ సంవత్సరపు నృత్యప్రదర్శనలో ఆమెను చూసిన కాశికి అప్పటి నుంచి కవితలకు ఆమే ప్రేరణగా మారిపోయే స్థితి వచ్చేస్తుంది. ఆమె అతని కవితా దేవతగా భావించుకుంటాడు. కాశీ స్నేహితులైన ముగ్గురు చిన్న పిల్లలు, గోదారి (రాళ్ళపల్లి) అనేద్వారా ఆ కవితలు చూసి చదివిన కీర్తనలో కాశీ పట్ల ప్రేమ అంకురిస్తుంది. ఆ గ్రామంలోకెల్లా సంపన్నులైనవారి కొడుకు శ్రావణ్ (శరత్ బాబు) చదువు ముగించుకుని ఊళ్ళోకి వస్తాడు. అతను మంచి స్నేహితులుచిత్రకారుడు, కీర్తన నాట్యం చూసి ఆమె పట్ల ప్రేమ పెంచుకున్నా కీర్తనకి కాశి పట్ల ఉన్న ప్రేమ గురించి తెలుసుకుని తన ఆలోచనలు వదులుకుంటాడు.
 
కాశీలోని గానకళ అందరికీ తెలిసేందుకు ఓ కచేరీ కూడా ఏర్పాటుచేస్తాడు, ఆ సమయంలోనే కాశి తల్లి మరణిస్తుంది. కీర్తనని విదేశాలకు తీసుకొనివెళ్లి ప్రదర్శనలు ఇప్పిస్తానంటాడు శ్రావణ్. ఈ విషయం తెలుసుకున్న కీర్తన తల్లి అసూయతో ఒకామెకి లంచం ఇచ్చి జాతరలో ఆమెను అమ్మవారు పూనినట్టుగా నటింపజేస్తుంది. కీర్తన తల్లి వేసిన పథకం ప్రకారం ఆ పూనకంలో కీర్తనకు వివాహం కారాదని అమ్మవారి ఆదేశించినట్టు నటిస్తారు. కీర్తన తనని ప్రేమిస్తోంది అన్న విషయం తెలుసుకున్న కాశి ఆ ప్రేమని అంగీకరిస్తాడు. తాను హైదరాబాద్ వెళ్ళి తిరిగివచ్చాకా ఎవరిని ఎదిరించైనా కాశీ, కీర్తనలను కలుపుతానని శ్రావణ్ మాట ఇస్తాడు. ఈ విషయం తెలుసుకున్న కీర్తన తల్లి ఆమెని చాలా ఆరళ్ళు పెడుతుంది, ఆ బాధలో తాండవం చేస్తూన్న కీర్తనను హఠాత్తుగా వివాహం చేసుకుంటాడు కాశీ. ఇది తెలిసిన గ్రామస్తులు వారిని గ్రామం నుంచి బహిష్కరిస్తారు.
పెద్ద కులానికి చెందిన కీర్తన (రమ్యకృష్ణ)ని నిజానికి పిల్లలు లేని వాసుదేవ మూర్తి (జె.వి.సోమయాజులు) గుడిమెట్లపై దొరికితే తెచ్చుకుని పెంచుకుంటూంటాడు. కానీ కీర్తన తమ సొంత కూతురు కాకపోవడంతో వాసుదేవమూర్తి భార్యకు ఆమెపై అక్కసు, వ్యతిరేకత ఉంటుంది. ఇదిలావుండగా ఆ ఊరి జనం దేవతలా భావించి కొలుస్తూ ఉంటారు. ఆమె అడుగుపెట్టాకే తమ కడగళ్ళు పోయాయని, గ్రామం సుభిక్షమైందని నమ్ముతూంటారు. సంవత్సరానికి ఒకసారి అమ్మవారి జాతరలో కీర్తన నాట్యం చేస్తూంటుంది, ఆమెకు నాట్యశాస్త్ర గురువు పరమేశ్వరశాస్త్రి (గిరీష్ కర్నాడ్). అలాంటి ఓ సంవత్సరపు నృత్యప్రదర్శనలో ఆమెను చూసిన కాశికి అప్పటి నుంచి కవితలకు ఆమే ప్రేరణగా మారిపోయే స్థితి వచ్చేస్తుంది. ఆమె అతని కవితా దేవతగా భావించుకుంటాడు. కాశీ స్నేహితుల ద్వారా ఆ కవితలు చూసి చదివిన కీర్తనలో కాశీ పట్ల ప్రేమ అంకురిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/సంకీర్తన_(సినిమా)" నుండి వెలికితీశారు