సంకీర్తన (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
 
కాశీలోని గానకళ అందరికీ తెలిసేందుకు ఓ కచేరీ కూడా ఏర్పాటుచేస్తాడు, ఆ సమయంలోనే కాశి తల్లి మరణిస్తుంది. కీర్తనని విదేశాలకు తీసుకొనివెళ్లి ప్రదర్శనలు ఇప్పిస్తానంటాడు శ్రావణ్. ఈ విషయం తెలుసుకున్న కీర్తన తల్లి అసూయతో ఒకామెకి లంచం ఇచ్చి జాతరలో ఆమెను అమ్మవారు పూనినట్టుగా నటింపజేస్తుంది. కీర్తన తల్లి వేసిన పథకం ప్రకారం ఆ పూనకంలో కీర్తనకు వివాహం కారాదని అమ్మవారి ఆదేశించినట్టు నటిస్తారు. కీర్తన తనని ప్రేమిస్తోంది అన్న విషయం తెలుసుకున్న కాశి ఆ ప్రేమని అంగీకరిస్తాడు. తాను హైదరాబాద్ వెళ్ళి తిరిగివచ్చాకా ఎవరిని ఎదిరించైనా కాశీ, కీర్తనలను కలుపుతానని శ్రావణ్ మాట ఇస్తాడు. ఈ విషయం తెలుసుకున్న కీర్తన తల్లి ఆమెని చాలా ఆరళ్ళు పెడుతుంది, ఆ బాధలో తాండవం చేస్తూన్న కీర్తనను హఠాత్తుగా వివాహం చేసుకుంటాడు కాశీ. ఇది తెలిసిన గ్రామస్తులు వారిని గ్రామం నుంచి బహిష్కరిస్తారు.
 
సరిగా ఇదే సమయానికి ఓ వాస్తవం బయటపడుతుంది. ఆలయ పూజారి శాస్త్రి కీర్తనకు అసలు తండ్రి అనీ, అతనికీ ఓ చిన్న కులస్తురాలైన ఆమెకీ పుట్టిన అమ్మాయి కావడంతో ఏం చేయాలో తెలియక మూర్తికి దొరికేలా చేసినట్టు చెప్తాడు. ప్రజల నమ్మకాన్ని ఆసరా చేసుకుని ఆమె దుర్గమ్మ రూపమని ప్రచారం చేసినట్టు, తాను చేసిన తప్పుకు ఆమె జీవితం నాశనం కాకూడదని హితవు చెప్తాడు.
"https://te.wikipedia.org/wiki/సంకీర్తన_(సినిమా)" నుండి వెలికితీశారు