సంకీర్తన (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
 
సరిగా ఇదే సమయానికి ఓ వాస్తవం బయటపడుతుంది. ఆలయ పూజారి శాస్త్రి కీర్తనకు అసలు తండ్రి అనీ, అతనికీ ఓ చిన్న కులస్తురాలైన ఆమెకీ పుట్టిన అమ్మాయి కావడంతో ఏం చేయాలో తెలియక మూర్తికి దొరికేలా చేసినట్టు చెప్తాడు. ప్రజల నమ్మకాన్ని ఆసరా చేసుకుని ఆమె దుర్గమ్మ రూపమని ప్రచారం చేసినట్టు, తాను చేసిన తప్పుకు ఆమె జీవితం నాశనం కాకూడదని హితవు చెప్పి వాళ్ళని పంపేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న ఊరి జనం ఆగ్రహంతో శాస్త్రిని చావగొడతారు. ఊరి జనం కాశిని చంపి తాము దేవతగా భావించే కీర్తనను తీసుకువద్దామని బయలుదేరతారు. ఇంతలో వారిపై ఎప్పటినుంచో కక్ష ఉన్న జమీందారు కొడుకు (సాయికుమార్), అతని మిత్ర బృందం కాశిని చితగ్గొట్టి కీర్తనను ఎత్తుకుపోతారు. కీర్తనను, కాశీనీ కాపాడేందుకు వాళ్ళను గోదారి చంపేస్తాడు. చివరకు ఆగ్రహంతో ఊగిపోతున్న గ్రామస్తులను అడ్డుకుని, వివేకాన్ని మేల్కొలిపేలా సందేశాన్నిచ్చి శ్రావణ్ కాశి-కీర్తన జంటను తీసుకుని వెళ్ళిపోతాడు.
 
== శైలి ==
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/సంకీర్తన_(సినిమా)" నుండి వెలికితీశారు