ఉమర్ ఆలీషా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{వికీకరణ}}
'''ఉమర్ ఆలీ షా''' (1886 - 1945) సూఫీ వేదాంత వేత్త, తెలుగు సాహితీ వేత్త, సంఘ సంస్కర్త, గ్రాంధికవాది. కవిరాజు డాక్టర్‌ ఉమర్‌ అలీషా మాతృభాష తెలుగు కాదు. తెలుగులో అద్భుత సాహిత్య సంపదలను సృష్టించి మహాకవిగా ఆయన ఖ్యాతిగాంచారు. ఆయన ఆధ్యాత్మిక పీఠాధిపతి అయినప్పటికీ కేవలం ఆధ్యాత్మిక తత్వానికే కట్టుబడకుండా సామాజానికి రుగ్మతల విూద కలాన్ని కొరడాలా ఝళిపించారు. స్వాతంత్య్ర సమరయోధునిగా జాతీయోద్యమంలో పాల్గొన్నారు. భారత శాసనసభలో ప్రజాప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించారు. అభ్యుదయ రచయితగా, ప్రగతి నిర్దేశకునిగా, మహోన్నత వక్తగా, మానవతావాద ప్రవక్తగా బహుముఖ ప్రజ్ఞావంతుడిగా ఖ్యాతి గడించారు. అజ్ఞానం, మూఢనమ్మకాలు, మత మౌడ్యం, పేదరికం, బానిసత్వం, అవిద్య లాంటి సాంఘిక రుగ్మతలతో కొట్టుమిట్టాడుతున్న సమాజాన్ని సంస్కరించేందుకు అనన్యసామాన్యమైన కృషి సాగించి ధన్యులైన తెలుగు గడ్డకు చెందిన కవులు, రచయితలలో ఉమర్‌ అలీషా గారిది ప్రత్యేక స్థానం. బహుముఖ లక్ష్య సాధన కోసం శరపరంపరగా సాహిత్య సంపద సృష్టించి తెలుగు సాహిత్య చరిత్ర పుటలలో ప్రత్యేక స్థానం పొందిన తెలుగు గడ్డకు చెందిన ముస్లిం కవులలో ఆచార్య ఉమర్‌ అలీషా అగ్రగణ్యులు.మౌల్వీ ఉమర్‌ అలీషా పూర్వీకులు శతాబ్దాల క్రితం పర్షియా (ఇరాన్‌) నుండి ఢిల్లీ వచ్చి, అటునుండి హైదరాబాద్‌ చేరి, చివరకు పిఠాపురంలో స్థిరపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఉమర్‌ అలీషా ఈ పద్యంలో వివరించారు.
<poem>
"https://te.wikipedia.org/wiki/ఉమర్_ఆలీషా" నుండి వెలికితీశారు