952
దిద్దుబాట్లు
Shankar1242 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Shankar1242 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
</poem>
ఇదిగాక భోజప్రబంధమువలన భోజరాజు యొక్క సభలోను ఒక కాళిదాసుఁడు ఉన్నట్టు తెలియవచ్చుచున్నది. ఇతఁడు సకల విషయములందును మొదటియాతనిని పోలినవాఁడు. ఒకానొక కాలమున భోజుని సభయందలి కవులలో ఒకఁడు అగు దండి అనువానికిని ఇతనికిని వివాదము కలిగి అప్పుడు కాళికాదేవిని ఆరాధించి మాలో కవి ఎవఁడో తెలుపవలయును అని ప్రార్థింపఁగా వారికి కాళికాదేవి ప్రత్యక్షమై "కవిర్దండిః, కవిర్దండిః, భవభూతిశ్చ మహాకవిః" అన్నదట. దానికి కాళిదాసునికి కోపము వచ్చి "కోహం రండే ?" ( ఓసి లంజా, నేను ఎవడిని?) అన్నాడుట. అప్పుడు కాళికాదేవి "త్వమేవాహం త్వమేవాహం త్వమేవాహం నసంశయః" ( నువ్వే నేను, నువ్వే నేను, నువ్వేనేను. అందులో సందేహం లేదు ) అని చెప్పినదట. అందువలన, ఈ కాళిదాసుఁడు కాళికాదేవి అవతారము అని చెప్పుదురు. ఈయన నళోదయము, శృంగార తిలకము, ప్రశ్నోత్తరమాల, కవికంఠ పాశము, కర్పూరమంజరి, భోజచంపువు అనెడు గ్రంథములను, శ్యామలా దండకమును రచియించెను. ఇందు కడపట ఉదహరించిన దండకము తనకు కాళికాదేవి ప్రత్యక్షము అయినప్పుడు చెప్పినది. ఇంతటి కవులు లోకములో మఱియెవరును కారు. కనుకనే,
శ్లో|| పురా కవీనాం గణనాం ప్రసంగే, కనిష్ఠికాధిష్ఠిత కాళిదాసః |
అద్యాపి తత్తుల్యకవే రభావా, దనామికా సార్థవతీ బభూవ||
ఈతని విషయమై కట్టుకథలు అనేకములు ఉన్నవి. అయినను మీఁద ఉదహరించిన విషయములనుపట్టి కాళిదాసులు ఇరువురు అనియు వాస్తవము ఐన చరిత్రము ఇదియే అనియు ఊహింపవలసి ఉన్నది.▼
</poem>
▲అని చెప్పఁబడి ఉన్నది.ఈతని విషయమై కట్టుకథలు అనేకములు ఉన్నవి. అయినను మీఁద ఉదహరించిన విషయములనుపట్టి కాళిదాసులు ఇరువురు అనియు వాస్తవము ఐన చరిత్రము ఇదియే అనియు ఊహింపవలసి ఉన్నది.
==రచనలు==
* [[మేఘ సందేశం (సంస్కృతం)|మేఘ సందేశము]]
* [[ఋతు సంహారము]]
== కవి నిర్లిప్తత ==
కాళిదాదు కవితలో స్ఫురించే ఇంకొక విషయం ముఖ్యంగా పేర్కొనవలసినది ఎక్కడా కవి తన కావ్యాల్లో తననుగూర్చి ప్రస్తావించుకోలేదనీ, దీనివల్ల పరిసోధకులకు తన కాలనిర్ణయం దుష్కరం అయిపోయినమాట అటువుంచితే ఆయన నిర్లిప్తత ఇతని జీవన ధృక్పధం అని ఊహించుకోవచ్చును. రఘువంశ ప్రారంభంలో ఈకవి తాను ముందుడనీ, కవియశస్సు ప్రార్ధించే తాను పొడగరులు అందుకోగలిగిన ఫలం ఆశించిన వామనుని వలె అపహాస్యపాత్రుడను కాగలననీ వ్రాశాడు.తిరిగి మాళవికాగ్నిమిత్రంలో ప్రాచీనమైనదల్లా యోగ్యమైనది కాజాలదనీ, నవ్యకావ్యమైనంత మాత్రంచేత అది నింద్యం కాజాలదనీ సహృదయులు ఈరెంటినీ అతిక్రమిచినవారనీ సూత్రధారుని ముఖతః పలికించినాడు. ఇంతకంటే ఈకవి ఆత్మగతాభిప్రాయాలు ఇతని కావ్యాల్లో ఇంకెక్కడా లభించలేదు.ఈకవి వ్యక్తిచరిత్ర విషయంలో అవలంబించిన మౌనాన్ని బట్టికూడా నిర్లిప్తమైన ఈతని జీవనశైలిని తెలియపరుస్తున్నది.అసలు ప్రాచీన కవితా సంప్రదాయాలలో కవికి నేటి కాలంలో బయలు దేరిన "స్వాతంత్ర్యం, అస్వాతంత్ర్యం" వంటి సమస్యలు బయలుదేరనేలేదు అనుకోవచ్చును. ఆకాలంలో భారతీయకవులు భారతీయమైన ఆధ్యాత్మిక సంప్రదాయం సహజంగా ఆకళించుకొన్నారు. అప్పుడు వ్యక్తి స్వాతంత్ర్యం సాంప్రదాయకమైన సాంఘికధర్మం అతిక్రమించి పైడదారులు తొక్కలేదు లేక యాంత్రికమైన ఒక్క శుష్కసంఘ శాసనానికి కట్టుబడనూలేదు. ఆధార్మిక ధృక్పధంలో సంఘవ్యక్తులకు పరస్పరాశ్రితమైన సహకారం సహజంగా పెంపొందింది. కనుకనే ఆరోజులలో కవులెవ్వరూ వ్యక్తి చరిత్రలు తమ కావ్యాల్లో వ్రాసుకోలేదని తోస్తుంది. అదీగాక భారతీయాధ్యాత్మిక సాంప్రదాయాన్ని సంపూర్ణంగా ఆకళించుకొన్న కాళిదాసుకవి తన వ్యక్తిత్వం విషయంలో గంభీరమైన ఓదాసీన్య వైఖరి అవలింబించి ఉంటాడు. కనుకనే ఈతని చరిత్ర నేటి పరిశోధకులకు ఇంత గడ్డు సమస్యగా పరిణమించింది. కాని ఆమహాకవి భౌతికవ్యక్తి జీవితం కాలగర్భంలో, మరుగుబడిపోయినా మనోహరమైన ఆతని ఆధ్యాత్మికత, ధార్మికత ఈ రెండిటినీ మించిన జీవితసౌందర్యార్చన ఆతని కావ్యాల్లో త్రిపధములై ఆతని కవితకు మందాకినీ గౌరవం కలిగించాయి.
=== ఇతరములు ===
=== వ్యాఖ్యానములు ===
=== ఇవి కూడా చూడండి ===
* [[మహాకవి కాళిదాసు (సినిమా)]]
=== బయటి లింకులు ===
* [http://en.wikipedia.org/wiki/Kalidasa కాళిదాస - వికీ ఆంగ్లము]
* [http://www.cs.colostate.edu/~malaiya/kalidas.html కాళిదాసు జీవితం మరియు రచనలు]
<!-- అంతర్వికీ లింకులు -->
|
దిద్దుబాట్లు