పరాన్నజీవనం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
 
==అతిథేయుల మీద పరాన్నజీవుల ప్రభావం==
పరాన్నజీవులు అతిథేయుల్లోని కణజాలాలు, రక్తం మరియు ఇతర శరీర ద్రవాలమీద పోషణ జరపటం వల్ల అతిథేయులు బలహీనులవుతాయి. వాటి పెరుగుదల క్షీణిస్తుంది.
* హానికరమైన ప్రోటోజోవాకు చెందిన పరాన్న జీవులు కొన్ని వ్యాధులను కలుగజేస్తాయి. ఉదా: [[మలేరియా]].
* పేగులో జీవించే [[జియార్డియా లాంబియా]] అనే ప్రోటోజోవా పరాన్నజీవి [[అతిసార వ్యాధి]]ని కలిగిస్తుంది.
* [[ఎంటమీబా హిస్టోలైటికా]] కణజాల పరాన్నజీవిగా ఉండి, [[రక్తవిరోచనాలు]], పేగులో పుళ్ళు, అప్పుడప్పుడూ కాలేయం, ఊపిరితిత్తులలో [[చీముగడ్డ]]లు కలగజేస్తుంది.
* కుహర పరాన్నజీవులైన టీనియా వంటి చదును పురుగులు, ఆస్కారిస్ వంటి గుండ్రని పురుగులు అతిథేయి పేగులోని ఆహారప్రసరణకు అడ్డుపడుతూ [[కడుపునొప్పి]]ని కలిగిస్తాయి. వీటివల్ల [[రక్తహీనత]] కూడా కలుగుతుంది.
* [[ఉచరీరియా బాంక్రాఫ్టీ]] వంటి గుండ్రటి పురుగులు మానవ అతిథేయిల్లో [[ఫైలేరియాసిస్]] లేదా [[ఎలిఫెంటియాసిస్]] అనే వ్యాధిని కలుగజేస్తాయి.
* కొన్ని పరాన్న జీవులు అవి నివసించే అతిథేయుల అవయవల్లో కణవిభజన రేటును త్వరితం చేస్తూ కణాల సంఖ్యను పెంచుతాయి. ఈ స్థితిని హైపర్ ప్లాసియా ( ) అంటారు. ఉదా: [[లివర్ ఫ్లూక్]] పిత్తాశయ నాళంలో హైపర్ ప్లాసియాని కలుగజేసి ఫలితంగా పైత్యనాళ కుహరం చిన్నదై [[పచ్చకామెర్లు]] వస్తుంది.
* కొన్ని పరాన్న జీవులు అవి నివసించే అతిథేయి శరీరాన్ని విపరీతంగా పెరిగేటట్లు చేస్తాయి. లివర్ ఫ్లూక్ డింభకాలు దాని మాధ్యమిక అతిథేయి అయిన [[నత్త]] యొక్క దేహం పెరిగేటట్లు చేస్తుంది.
 
 
[[వర్గం:పరాన్న జీవశాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/పరాన్నజీవనం" నుండి వెలికితీశారు