స్వెత్లానా అలెక్సీవిచ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
ఆమె సోవియట్ యూనియన్‌లోని ఉక్రెయిన్ ఎస్‌ఎస్‌ఆర్‌లోగల స్టానిస్లావ్‌లో [[మే 31]], [[1948]] న జన్మించారు. వృత్తిరీత్యా జర్నలిస్టు అయిన ఆమె బాల్యం రెండో ప్రపంచ యుద్ధం మిగిల్చిన భయానక వాతావరణంలో గడిచింది. అందువల్లనే ఆమె జర్నలిస్టుగా యుద్ధ బాధితుల వెతలను ప్రపంచానికి చూపించటమే లక్ష్యంగా పనిచేశారు. ముఖ్యంగా మహిళల దయనీయ పరిస్థితులే కథా వస్తువులుగా పలు పుస్తకాలు రాశారు. ఆమె ప్రధానంగా రష్యన్ భాషలోనే రచనలు చేశారు. చెర్నోబిల్ అణువిద్యుత్ కేంద్రం దుర్ఘటన, సోవియట్ యూనియన్ విచ్చిన్నానికి ముందు, ఆ తర్వాత పరిస్థితుల చుట్టే ప్రధానంగా ఆమె రచనలు సాగాయి. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంతో 1985లో ఆమె రచించిన వార్స్ అన్‌వామింగ్‌లీ ఫేస్ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. యుద్ధ బాధిత మహిళలే తమ గోడును స్వయంగా వెల్లబోసుకొంటున్నట్లు ఫస్ట్ పర్సన్‌లో సాగే ఈ పుస్తకం అనేక భాషల్లోకి అనువాదమైంది.
 
యుద్ధ బాధిత చిన్నారుల అనుభవాల ఆధారంగా ఆమె రాసిన ది లాస్ట్ విట్నెస్: ది బుక్ ఆఫ్ అన్‌చైల్డ్‌లైక్ స్టోరీస్ పుస్తకం కూడా ఆమెకు గొప్ప గుర్తింపు తెచ్చింది. సోవియట్ యూనియన్ పతనం ఆధారంగా 1993లో రాసిన ఎన్‌చాంటెడ్ విత్ డెత్ పుస్తకం నాటి ప్రజల మానసిక సంఘర్షణలను ప్రపంచానికి సజీవంగా చూపింది. అత్యుత్తమ రచనలు చేసిన ఆమెకు అనేక అవార్డులు లభించాయి. చెర్నోబిల్ దుర్ఘటన బాధితులపై రాసిన వాయిసెస్ ఆఫ్ చెర్నోబిల్ గ్రంథానికి 2005లో నేషనల్ బుక్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు లభించింది.
==పురస్కారాలు==
# 1996లో టుచోల్‌స్కీ ప్రైజ్,
# 1997లో ఆండ్రీ సిన్యావ్‌స్కీ ప్రైజ్,
# 1998లో లీప్‌జిగ్ బుక్‌ప్రైజ్,
# 1999లో హెర్డర్ ప్రైజ్‌
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==ఇతర లింకులు==
==ఇతర లింకులు==
{{నోబెల్ బహుమతి అందుకున్న మహిళలు}}