వికిరణం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
 
“రేడియేషన్,” “రేడియోఏక్టివ్” వంటి మాట విన్నప్పుడు మనకి అణు బాంబులు, అణు విద్యుత్ కేంద్రాలలో ప్రమాదాలు, కేన్సరు వ్యాధి, మొదలైన భయంకరమైన విషయాలు మనస్సులో మెదులుతాయి. కాని పైన ఇచ్చిన వివరణ చదివిన తరువాత ఈ రెండూ ప్రకృతిలో సహజ సిద్ధమైన ప్రక్రియలే కాని ప్రత్యేకించి ప్రమాదమైనవి కావని తెలుస్తూనే ఉంది కదా. ఏదైన శృతి మించినా, మితి మీరినా ప్రమాదమే. మితిమీరితే అన్ని రకాల వికీర్ణాలూ ప్రమాదమే. బోగి మంటకి మరీ దగ్గరగా వెళితే ఒళ్లు కాలదూ?
 
వికీర్ణం మన ఆరోగ్యానికి ప్రమాదమా, కాదా అన్న ప్రసక్తి వచ్చినప్పుడు ఆ వికీర్ణం ఎంత శక్తిమంతమైనదో చూడాలి. ఒక వికీర్ణం ఒక అణువు (atom) చుట్టూ పరిభ్రమిస్తూన్న ఎలక్ట్రాన్ గతిని తప్పించగలిగే అంట శకితో ఉన్నదయితే దానిని అయనైజింగ్ వికీర్ణం (ionizing radiation) అంటారు. ఇటువంటి శక్తితో కూడిన వికీర్ణం మన శరీరాన్ని తాకితే మన ఆరోగ్యం భంగపడే సావకాశం ఉంది. ఎందువల్ల? ఈ తాకిడి దెబ్బకి మన డి.ఎన్.ఎ. లో ఉన్న అణువుల అమరిక దెబ్బతిని ప్రతివర్తితలు (mutations) పుట్టి, తద్వారా కేన్‌సర్ వంటి రోగాలు పుట్టుకురావచ్చు.
 
==వికీర్ణ కర్బనం==
"https://te.wikipedia.org/wiki/వికిరణం" నుండి వెలికితీశారు