త్రియుగీ నారాయణ్ ఆలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''త్రియుగీ నారాయణ్ ఆలయం''' ({{lang-sa|त्रियुगी-नारायण}}) [[ఉత్తరాఖండ్]] కు చెందిన [[రుద్రప్రయాగ]] జిల్లాలోని త్రియుగీ నారాయణ్ గ్రామంలో నెలకొన్ని హిందూ దేవాలయం. ఇది విష్ణుమూర్తికి చెందిన అత్యంత ప్రాచీనాలయం. పౌరాణికంగానూ ఆలయానికి ప్రశస్తి ఉంది.
== శబ్ద వ్యుత్పత్తి ==
త్రియుగీ నారాయణ్ అన్నది త్రియుగి, నారాయణ్ అన్న రెండు పదాల కలయికగా రూపొందింది. వీటిలో నారాయణ్ అన్నది కొలువైవున్న దేవుని గురించిన పదం కాగా, త్రియుగి పదానికి పలు అర్థాలు చెప్తున్నారు. హిందూ నమ్మకాల ప్రకారం ప్రస్తుతం కలియుగం నడుస్తూండగా ఈ ఆలయానికి సత్య, ద్వాపర, త్రేతా యుగాల వైభవం కలిగివుందనీ, అత్యంత సుదీర్ఘమైన దేవమానంలో దేవతల మూడు తరాలను చూసినదనీ పలు విధాలైన అర్థాలను త్రియుగీ అన్న శబ్దానికి చెప్తారు. అలానే వసంత, శరత్తు, వర్ష రుతువులు ఒకే సమయంలోనూ, త్రేతాగ్నులుగా భావించే మూడు అగ్నులు ఎల్లప్పుడూ నివసించేదనీ అర్థం చెప్తూంటారు. ఈ అర్థం కాక త్రియుగి అన్న శబ్దానికి గుప్తం అంటే రహస్యం, అదృశ్యం అన్న అర్థం ఉండగా, నారాయణుడన్న శబ్దానికి వ్యాపకార్థం ఉంది. దీని ప్రకారం అదృశ్యంగా, అంతటా వ్యాప్తి పొందినవాడన్న అర్థం త్రియుగీ నారాయణునికి అన్వయిస్తూంటారు.